నయా ఇంగ్లిష్‌: ఘోస్ట్‌ కిచెన్‌ అంటే?

What is Ghost Kitchen Concept, What is Example of Hyperbole - Sakshi

కస్టమర్‌ల కోసం ఇండోర్‌ సీటింగ్‌ ఉండదు. వెయిటర్లు ఉండరు. డైనింగ్‌ రూమ్‌ ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఫుడ్‌ డెలివరీ వోన్లీ తరహా రెస్టారెంట్లను ‘ఘోస్ట్‌ కిచెన్‌’ అంటారు.   truthiness అంటే? అమెరికన్‌ టెలివిజన్‌ కమెడియన్‌ స్టిఫెన్‌ కోల్బర్ట్‌  ఈ టెర్మ్‌ను కాయిన్‌ చేశాడు. సాక్ష్యాలు, ఆధారాలతో సంబంధం లేకుండా ఒక విషయాన్ని గట్టిగా నమ్మడం... ట్రూతినెస్‌. sobercurious అంటే? ఆల్కహాల్‌ ముట్టకుండా ఒక నిర్ణితమైన కాలాన్ని ప్రయోగాత్మకంగా గడపడం. (చదవండి: పూజను 70 లక్షల మంది ఫాలో అవుతున్నారు.. ఎందుకంటే!)

హైపర్‌బొలి అనగా...
ఏదైనా విషయాన్ని కాస్త అతిశయంగా చెప్పడమే హైపర్‌బొలి. భావాన్ని యథాతథం గా తీసుకోవద్దు. కవితల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. ఉదా:  అతని కళ్లు కన్నీటి సముద్రాలు అయ్యాయి. convolution అంటే ఒక విషయం కష్టంగా, సంక్లిష్టంగా ఉండడం. ‘మనం సృష్టించకపోతే పదాలు ఎలా పుడతాయి!’ అనేది ఒక పాలసీ. పాత పదాలనే కొత్తగా కాయిన్‌ చేయడం అనేది మరో పద్ధతి. ‘ఒరిజనల్‌ సెన్స్‌ ఆఫ్‌ ది వర్డ్‌’కు దగ్గరగా తమాషా పదాలను సృష్టించడమే aptagram

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top