బేకింగ్ సోడాతో హోమ్ మేకింగ్ | Making home with baking soda | Sakshi
Sakshi News home page

బేకింగ్ సోడాతో హోమ్ మేకింగ్

May 16 2015 12:54 AM | Updated on Sep 3 2017 2:06 AM

బేకింగ్ సోడాతో హోమ్ మేకింగ్

బేకింగ్ సోడాతో హోమ్ మేకింగ్

కేక్‌లు, కుకీస్ వంటివి గుల్లగా రావడం కోసం వాటి తయారీలో బేకింగ్ సోడాని వాడుతుంటాం మనం.

కిచెన్ కిటుకు
 
కేక్‌లు, కుకీస్ వంటివి గుల్లగా రావడం కోసం వాటి తయారీలో బేకింగ్ సోడాని వాడుతుంటాం మనం. కానీ అది వంట చేయడానికే కాదు... చాలా వాటికి పనికొస్తుంది. చాలా పనులు చేసిపెడుతుంది. అవేంటంటే...{ఫిజ్ కనుక దుర్వాసన వస్తుంటే, ఓ చిన్న గిన్నెలో బేకింగ్ సోడా వేసి లోపల ఉంచితే చాలు. ఆ వాసన పోతుంది;ఆభరణాలు కిలుం పట్టినట్టుగా తయారైతే... బేకింగ్ సోడాలో కొంచెం నీళ్లు కలిపి పేస్టులా చేసి, దానితో కడిగితే తిరిగి మెరుస్తాయి;

మన దంతాలు రంగు మారినప్పుడు బేకింగ్ సోడాలో ఉప్పు కలిపి తోముకుంటే మళ్లీ తెల్లగా అయిపోతాయి;నేలమీద పడిన నూనె జిడ్డు వదలకుండా ఉంటే కాసింత బేకింగ్ సోడా చల్లి కడిగితే జిడ్డు పోతుంది.అలాగే వంటగిన్నెల జిడ్డును కూడా బేకింగ్ సోడాతో కడిగి పోగొట్టవచ్చు;డస్ట్‌బిన్ వాసన వస్తుంటే అందులో కాస్త బేకింగ్‌సోడా చల్లితే సరి; స్నాక్స్ దుర్వాసన గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ వాసన వదిలించడానికి నీటిలో బేకింగ్ సోడా వేసి నానబెట్టి ఉతికితే ఫలితముంటుంది;లంచ్ బాక్సులు వాసన వస్తుంటే వాటిని నీటితో నింపి, అందులో కాస్త బేకింగ్ సోడా వేసి నాననిచ్చి, గంట తర్వాత కడిగేస్తే వాసన మాయమౌతుంది;పిల్లలు గోడమీద గీసిన పెన్నుగీతలు పోవాలంటే తడి స్పాంజికి బేకింగ్‌సోడా అద్ది తుడవాలి.

 

Advertisement
 
Advertisement
Advertisement