స్క్రీన్ టైమ్, ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి కారణంగా ఈ రోజుల్లో చాలామంది నిద్రకు దూరం అవుతున్నవారు. నిద్ర సమస్యలనుంచి విముక్తి లభించి, మంచి నిద్ర పట్టాలంటే సులువైన యోగాసనాలు ఉన్నాయి. నిద్రకు ఉపక్రమించడానికి అరగంట ముందు ఈ ఆసనాలు సాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు.
పశ్చిమోత్తనాసనం
నేలపైన కాళ్లను ముందుకు చాపి, కూర్చోవాలి. శరీరాన్ని మోకాళ్ల వైపు వంచి, చేతులు పాదాలను తాకించాలి. ఈ భంగిమలో రెండు నిమిషాలు ఉండాలి. దీని వల్ల మానసిక ప్రశాంతత కలిగి మంచినిద్రకు సహాయపడుతుంది.
అర్ధ శలభాసనం
మ్యాట్‌పైన బోర్లా పడుకొని, ఒక కాలును పైకి లే΄ాలి. తలను నెమ్మదిగా వెనక్కి వంచాలి. ఐదు శ్వాసల తర్వాత, రెండో కాలితో ఇలాగే చేయాలి. దీనివల్ల రక్తప్రవాహం మెరుగై మానసిక శాంతి పెరుగుతుంది.
శవాసనం
మ్యాట్‌పైన పడుకొని, చేతులను రిలాక్స్‌గా ఉంచుతూ ఐదు నిమిషాలు ఉండాలి. సాధారణ శ్వాసలు తీసుకుంటూ ఉండాలి. దీని వల్ల మానసిక శాంతి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుంది.
చదవండి: శివసేన నేతతో నటి ఎంగేజ్‌మెంట్ : ఫోటోలు వైరల్
పరిపూర్ణ శ్వాస
శ్వాస తీసుకొని, కొద్ది సెకన్లు ఆ శ్వాసను బిగబట్టి, తిరిగి నెమ్మదిగా వదలాలి. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ, ముక్కుద్వారానే వదలాలి. ఇలా 3 నుంచి 5 నిమిషాలు చేయాలి. ఒత్తిడి తగ్గి, శరీరానికి విశ్రాంతి లభించి, నిద్ర బాగా పడుతుంది. స్క్రీన్ టైమ్, ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి కారణంగా ఈ రోజుల్లో చాలామంది నిద్రకు దూరం అవుతున్నవారు. నిద్ర సమస్యలనుంచి విముక్తి లభించి, మంచి నిద్ర పట్టాలంటే సులువైన యోగాసనాలు ఉన్నాయి. నిద్రకు ఉపక్రమించడానికి అరగంట ముందు ఈ ఆసనాలు సాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు.
(ఎక్కడ చూసినా సీతాఫలాలే, ఇవిగో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్)
బలాసన
ముందుగా మ్యాట్‌పైన మోకాళ్ల పై కూర్చోవాలి. ముందుకు వంగి, తలను మోకాళ్ల మీదుగా తీసుకెళుతూ, నేలను తాకాలి. అదే సమయంలో చేతులు ముందుకు చాచి, మోకాళ్లపై విశ్రాంతి తీసుకోవాలి. ఈ భంగిమంలో రెండు నిమిషాలు ఉండాలి. దీంతో శరీరం రిలాక్స్ అయ్యి, ఒత్తిడి తగ్గుతుంది.
రాత్రి నిద్రించడానికి ముందు చేసే కొన్ని యోగాసనాల వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటుంది. గ్యాస్ట్రిక్, పొట్ట భాగంలో అధిక కొవ్వు సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. భోజనం చేసిన రెండు గంటల తర్వాతనే ఈ ఆసనాలను సాధన చేయాలి. అప్పుడే నిద్ర, ఉదరకోశ సమస్యలకు సరైన ఫలితాలను పొందుదుతారు.


