ఇటీవలి కాలంలో సెలబ్రిటీల వెడ్డింగ్ బెల్స్ జోరుగా మోగుతున్నాయి. రానున్న వెడ్డింగ్ సీజన్‌కు తగ్గట్టుగా అందరూ మూడుముళ్ల వేడుకకు రెడి అవుతున్నారు. తాజాగా మరాఠీ నటి తేజస్విని లోనారి , శివసేన నేత సమాధన్ సరవంకర్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా సోషల్‌మీడియాలో పంచుకోవడంతో నెట్టింట సందడి నెలకొంది.
శివసేన పార్టీ యువతనేత సమాధన్ సరవంకర్ సీనియర్ నేత సదా సర్వాంకర్ పెద్ద కుమారుడు. తేజస్విని లోనారి -సమాధన్ సరవంకర్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబం సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సోమవారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి. అటు పార్టీ అభిమానులు, ఇటు ఫ్యాన్స్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. చక్కటి జంట అంటూ వీరికి అభినందనలు వెల్లువెత్తాయి.

తేజస్విని ఎంబ్రాయిడరీ ,జరీ వర్క్‌తో కలగలిసిన అందమైన ఎరుపు సాంప్రదాయ చీరలో అందంగా మెరిసింది. దీనికి తగ్గట్టు ఆభరణాలు, చేతినిండా గోరింటాకుతో పెళకళతో ఉట్టిపడేలా కనిపించింది. అటు ఎంబ్రాయిడరీ , సీక్విన్ వర్క్‌తో తయారు చేసిన వైట్ షార్ట్ షేర్వానీలో సమాధన్ శరవంకర్ అందంగా కనిపించాడు.
మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి తేజస్విని. అనేక టీవీ మరాఠీ సీరియల్స్‌లో నటించి తనదైన ముద్ర వేసింది. మరోవైపు, సమాధాన్ సారవంకర్ శివసేనకు చెందిన చురుకైన యువ నాయకుడు. ముంబై రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సమధాన్ తండ్రిసదా శరవంకర్ మహీం నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం షిండే గ్రూపురాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.



