Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్‌ తప్పవు మరి! | Today tip: Follow these to stay healthy during the monsoon season | Sakshi
Sakshi News home page

Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్‌ తప్పవు మరి!

Jul 1 2025 4:13 PM | Updated on Jul 1 2025 6:01 PM

Today tip: Follow these to stay healthy during the monsoon season

చిరు జల్లుల, హోరు వానలతో వర్షాకాలం హాయిగా మనల్ని పలకరించేసింది. ఒళ్లంత తుళ్లింత కావాలిలే.. గుండెల్లో జల్లంతా కురవాలిలే! అన్న మురిపెం మాత్రమే కాదు ఇది వ్యాధులు ముసురుకునే కాలం కూడా. వైరస్‌లు, బ్యాక్టీరియా విజృంభించే కాలం. ఇన్‌ఫెక్షన్లు చాలా తొందరగా వ్యాపిస్తాయి. ఫలితంగా వైరల్‌ ఫీవర్లు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కలరా, టైఫాయిడ్ ముసిరే అవకాశం ఉంది. ఇవాల్టి టిప్‌ ఆఫ్‌ ది డే లో భాగంగా వర్షకాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.

వేసవి తర్వాత వాతావరణంలో జరిగే మార్పులు, రుతుపవనాలు  మార్పుల తదితర కారణా లరీత్యా సీజనల్ వ్యాధులు దాడిచేస్తాయి.ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

ఎడతెరపి లేని వర్షాలు, వాటివల్ల నిల్వ ఉండే నీటిలో దోమలు ఆవాసాలను ఏర్పరచుకోవడం, రోడ్లపై మురిగిన నీరు ఉండటం.. ఇలా రకరకాల కారణాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.

నీటికుంటలో, కాలువల్లో, ఇంటి పరిసరాల్లో నీరు చేరకుండా చూసుకోవాలి. నిల్వ ఉన్న నీరు దోమలకు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలకు సంతానోత్పత్తి  నిలయంగా  మారి,వ్యాధులకు కారణమవుతాయి.

దోమల డెంగ్యూ, మలేరియా టైపాయిడ్ తో పాటు గాలి ద్వారా వ్యాపించే జబ్బులు జలుబు, గొంతునొప్పి వస్తాయి.  (Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే)

వర్షాల వల్ల నీరు  కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ.  అందుకే శుభ్రమైన, కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది.  గోరువెచ్చని  నీటిని తాగితే ఇంకా మంచిది.

తాజాకూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఆకుకూరలు వాడేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా కడిగి, బాగా ఉడికించి తీసుకోవాలి.

బయట ఫుడ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంట్లోనే తయారు చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 

కలుషిత ఆహారం ద్వారా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంతవరకు స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోవాలి.

ఆహారానికి తీసుకునేముందు ముందు చేతులు కడుక్కోవాలి.ఏదైనా తినడానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఈ చిన్న అలవాటు మిమ్మల్ని ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా  పిల్లలకు దీన్ని బాగా అలవాటు చేయాలి.

రాత్రి పూటదోమలు కుట్టకుండా దోమతెరలు వాడటం మంచిది. బాగా చల్లగా ఉన్నపుడు శరీరం వెచ్చగా ఉండేలా ఉన్ని దుస్తులు ధరించాలి.

పోషకాహారం ఆహారంపై శ్రద్ధపెట్టాలి. రోగనిరోధక శక్తి బలపడేలావిటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలి. ఇవి వ్యాధులు రాకుండా నివారిస్తాయి.

వర్షం అనగానే సంబరపడిపోయే పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక వేళ వర్షంలో తడిచినా, వెంటనే శుభ్రంగా తుడిచి పొడి బట్టలు వేయాలి. ముఖ్యంగా తల తడి లేకుండా చూసుకోవాలి.  ఏమాత్రం అశ్రద్ధ చేసినా అనారోగ్యం తప్పదు.

ఇదీ  చదవండి : కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్‌ వీడియో

పిల్లల్లో జలుబు, చిన్నపాటి జ్వరాల నుంచి కాపడడానికి అల్లం, తులసి, వామ్ము ఆకులతో చేసిన కషాయానికి కొద్దిగా  తేనె కలిపి ఇస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.

నోట్‌ : ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ఎలాంటి అనారోగ్య లక్షణాలు కన్పించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స  తీసుకోవడం ఉత్తమం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement