
బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో పడితే..ఏ తండ్రి అయినా చూస్తూ ఉరుకుంటాడా..? తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముందుకు దూకేస్తాడు. సరిగ్గా అదే చేశాడో తండ్రి. తన కళ్లముందే బిడ్డ సముద్రంలో పడిపోవడాన్ని చూసి క్షణం ఆలోచించకుండా దూకేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలుస్తోంది.
డిస్నీ క్రూయిజ్ షిప్ లోని 4వ డెక్ నుంచి ఒక పాప పొరపాటున జారి పడబోయింది. ఇది చూసిన తండ్రి క్షణం ఆలోచించుండా ఆమెను కాపాడటానికి సముద్రంలోకి దూకాడు. జూన్ 29న బహామాస్ - ఫోర్ట్ లాడర్‌డేల్ మధ్య ఓడ ప్రయాణంలో ఈ సంఘటన జరిగింది. బహామాస్ చుట్టూ నాలుగు రాత్రుల షిప్‌లో గడిపిన తరువాత ఓడ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్‌కు తిరిగి వస్తోంది.
చదవండి: కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్
"ఓడ వేగంగా కదులుతోంది. సముద్రపు హోరును, నీటి మెరుపులను చూస్తూ ప్రయాణికులుఎంజాయ్ చేస్తున్నారు. తన అయిదేళ్ల కమార్తెకు తండ్రి రైలింగ్ దగ్గర ఫోటో తీస్తున్నాడు. ఇంతలోనే ఆ పాప పడిపోయింది. వెంటనే తండ్రి కూడా దూకేశాడు. దీంతో ఓడ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. కెప్టెన్ వెంటనే ఓడను స్లో చేశాడు. ఇంతలో క్రూ సభ్యులు లైఫ్‌సేవర్లను నీటిలోకి విసిరారు. క్రూయిజ్ షిప్ నుంచి రెస్క్యూ బోట్ ద్వారా తండ్రీ కూతుళ్లను రక్షించారు. ఇది కళ్లప్పగించి చూస్తున్న ప్రయాణికులు బిగ్గరగా హర్షధ్వానాలు చేశారు. అటు ప్రయాణీకులు, ఇటు డిస్నీ సిబ్బంది తండ్రి ధైర్యాన్ని ప్రశంసించారు.హీరో అంటూ నెటిజనులు కూడా తండ్రిని అభినందనల్లో ముంచెత్తారు. ఈ సంఘటనను రికార్డ్ చేసిన ట్రేసీ రాబిన్సన్-హ్యూస్, "బిడ్డను కాపాడటానికి దూకిన ఒక హీరో’’ అంటూ ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్‌లో వైరల్‌గా మారింది.
NEW: Father jumps overboard to save his 5-year-old daughter, who fell off a Disney cruise ship from the 4th deck into the ocean.
The ship was heading back to South Florida when the intense rescue was made.
"The ship was moving quickly, so quickly, it's crazy how quickly the… pic.twitter.com/PTGmAzZJ7O— Collin Rugg (@CollinRugg) June 30, 2025
మరోవైపు డిస్నీ క్రూయిజ్ లైన్ తమ సిబ్బంది స్పందించిన తీరు, ప్రయాణీకులను రక్షించిన తీరును ప్రశంసిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సోమవారం తెల్లవారుజామున ఆ ఓడ సురక్షితంగా పోర్ట్ ఎవర్‌గ్లేడ్స్‌కు తిరిగి వచ్చింది.
ఇదీ చదవండి: 5 వేల కిలోమీటర్ల దూరంనుంచి రెండుగంటల్లో సర్జరీ : విప్లవాత్మక అడుగు