వీడియో: కన్న కూతురిని చితకబాదుతూ తండ్రి పైశాచిక ఆనందం | Father Brutally Beats His Daughter In Medak District | Sakshi
Sakshi News home page

వీడియో: కన్న కూతురిని చితకబాదుతూ తండ్రి పైశాచిక ఆనందం

Sep 20 2021 5:27 PM | Updated on Sep 21 2021 9:18 AM

Father Brutally Beats His Daughter In Medak District - Sakshi

సాక్షి, మెదక్‌: తాగిన మైకంలో కన్న కూతురిని తండ్రి చితకబాదిన ఘటన మెదక్‌ పట్టణంలో సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మెదక్‌ డీఎస్పీ సైదులు తెలిపారు. పట్టణానికి చెందిన మాడిశెట్టి నాగరాజు, భార్య మౌనిక దంపతులకు ఇద్దరు పిల్లలు. రెండు నెలలుగా నాగరాజు మరో మహిళతో సన్నిహితంగా ఉండటంతో భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లింది.

పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా భార్యతో ఉంటానని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూతురు గగనశ్రీతో మరో మహిళ వద్దకు వెళ్లిన నాగరాజు, చిన్నారిని విచక్షణ రహితంగా చితకబాదాడు. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో నాగరాజుపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

చదవండి: Gachibowli: భారీ చోరీకి పాల్పడిన ‘నేపాల్‌’ వాచ్‌మెన్‌ దంపతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement