
చైనా వైద్యులు వైద్యచరిత్రలో విప్లవాత్మకమైన పురోగతి సాధించారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 5,000 కిలోమీటర్ల దూరం నుండి రిమోట్ రోబోటిక్ ఆపరేషన్ నిర్వహించి రికార్డు సృష్టించారు. శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఇలా శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి.
టిబెట్‌లోని లాసాలో ఉన్న వైద్య బృందం బీజింగ్‌లోని 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇద్దరు రోగులకు రోబోటిక్ సాయంతో కాలేయ శస్త్రచికిత్స నిర్వహించింది. PLA జనరల్ హాస్పిటల్‌కు చెందిన ప్రొఫెసర్ రోంగ్ లియు నేతృత్వంలో కాలేయ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఉపగ్రహ కమ్యూనికేషన్‌ను ఉపయోగించి ఇప్పటివరకు నిర్వహించిన అతి పొడవైన దూర శస్త్రచికిత్సగా నిలిచింది.
Apstar-6D ఉపగ్రహం ద్వారా 68 ఏళ్ల కాలేయ కేన్సర్ రోగి, 56 ఏళ్ల హెపాటిక్ హెమాంగియోమాకు ఈ రెండు శస్త్రచికిత్సలు నిర్వహించారు. కేవలం 125 నిమిషాల్లో బ్లడ్ లాస్ లేకుండా చేయడమే కాదు, 24 గంటల్లో రోగులు పూర్తిగా కోలుకోవడం విశేషం.
ఉపగ్రహ శస్త్రచికిత్స, సిద్ధాంతపరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ, సిగ్నల్ ఆలస్యం కారణంగా సవాళ్లను ఎదుర్కొంది. వీటిని అధిగమించడానికి, ప్రొఫెసర్ లియు బృందం మూడు ప్రధాన ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది: 632 ms జాప్యంలో కూడా రోబోటిక్ హ్యాండ్ లోపాన్ని 0.32 mmకి పరిమితం చేసేలా న్యూరాల్ నెట్‌వర్క్‌ను వినియోగించింది. అలాగే ఉపగ్రహం విఫలమైతే తక్షణమే 5G బ్యాకప్‌కు మారే ద్వంద్వ-లింక్ వ్యవస్థను, HD ఇమేజింగ్‌ను కొనసాగిస్తూనే, డేటా లోడ్‌ను 62శాతం తగ్గించేందుకు డైనమిక్ బ్యాండ్‌విడ్త్ కేటాయింపును వాడింది.
ఇదీ చదవండి: కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్
రిమోట్,విపత్తు ప్రభావిత ప్రాంతాలకు అధునాతన శస్త్రచికిత్స సేవలు అందించడంలో ఇది కీలక మలుపు అని ప్రొఫెసర్ లియూ చెప్పారు. ముఖ్యంగా వైద్యులు సకాలంలో చేరుకోలేని వార్ జోన్స్, ప్రకృతి వైపరీత్యాలలో క్లిష్టమైన రెస్క్యూ మిషన్లకు ఇది చక్కటి పరిష్కారం అన్నారు. చైనా ఇప్పుడు ఉపగ్రహ సాంకేతికతో చేసే ఆపరేషన్ల మోడల్‌ను విస్తృత జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యూహాలలో చేర్చాలని యోచిస్తోంది. ఇది అంతరిక్ష ఆధారిత వైద్యం విషయంలో కొత్త యుగానికి నాంది పలికిందని నిపుణులు పేర్కొంటున్నారు.
చదవండి: 900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు