Chiranjeevi: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్యపరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?

Megastar Chiranjeevi Health Update - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ని ఏలుతున్న స్టార్‌ హీరో. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తర్వాత స్వయంకృషితో ఎదిగిన ఏకైక నటుడు. 67 ఏళ్ల వయసులో అదే జోష్‌లో దూసుకెళ్తూ కుర్ర హీరోలకు సవాల్‌ విసురుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్యతో సాలిడ్‌ హిట్‌ అందుకున్న మెగాస్టార్‌..ఆరు నెలల గ్యాప్‌లో ‘భోళా శంకర్‌’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అయితే ఈ చిత్రం తొలి రోజే డిజాస్టర్‌ టాక్‌ సంపాదించుకుంది. చిరంజీవి స్థాయిని దిగదార్చేలా మెహర్‌ రమేశ్‌ మేకింగ్‌ ఉందని మెగా అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా విమర్శిస్తున్నారు. అదే సమయంలో రీమేక్‌ చిత్రాలకు వెళ్లొద్దని చిరంజీవికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా మోకాలి సర్జరీ జరిగింది. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న చిరంజీవి.. తాజాగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆర్థోస్కోపి నీ వాష్ ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు.

(ఇదీ చదవండి: Chiranjeevi : సర్జరీ @ ఢిల్లీ, వచ్చే వారం హైదరాబాద్ కు చిరంజీవి)

వారంలో హైదరాబాద్‌కు రాకా
ప్రస్తుతం చిరంజీవి ఢిల్లీలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలోని వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దాదాపు వారం రోజుల తర్వాత ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఆగస్ట్‌ 22 అంటే ఆయన బర్త్‌డే రోజు కొత్త సినిమా ప్రారంభోత్సవంలోనూ పాల్గొంటారు. ఈ చిత్రానికి 'బంగార్రాజు' ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా.. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

మూడు వారాల విశ్రాంతి
చిరంజీవికి మోకాలి నొప్పి రోజు రోజుకి తీవ్రతరం కావడంతో సర్జరీ చేయించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. భోళా శంకర్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు ముగిసిన వెంటనే సర్జరీ చేయించుకోవాలని భావించారు. అందుకు తగ్గట్టే ఆరు నెలల క్రితమే తన డేట్స్‌ని సర్దుబాటు చేసుకున్నారట. అయితే చిరుకి జరిగిన సర్జరీ చాలా చిన్నదని సమాచారం. నీ వాష్ ట్రీట్ మెంట్ అంటే.. మోకాలి చిప్ప భాగంలో ఏర్పడే ఇన్ ఫెక్షన్ ను తొలగిస్తారు. టెక్నాలజీని ఉపయోగించి నిమిషాల్లో ఈ సర్జరీ పూర్తి చేస్తారు. ప్రస్తుతం చిరంజీవి సాధారణంగాగే ఉన్నారట. రోజూలాగే నడవడం, తన పనులు తాను చేసుకోవడం చేస్తున్నారట. వారంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి వచ్చి మరో రెండు వారాల పాటు ఇక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత తన షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌లో పాల్గొంటారట. 

రెమ్యునరేషన్‌పై ‘భోళా..’ ఎఫెక్ట్‌
దాదాపు తొమ్మిదేళ్లు నటనకు విరామం ఇచ్చిన చిరంజీవి ఖైదీ 150(2017) చిత్రంలో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏడాదికో సినిమాను విడుదల చేస్తూ వచ్చాడు. కానీ ఇటీవల కాలంలో మాత్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏడాది రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్‌ చేస్తున్నాడు. అంతేకాదు ఈ మధ్య కాలంలో తన రెమ్యునరేషన్‌ కూడా పెంచేశాడట చిరంజీవి. ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రానికి రూ.55 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్న చిరు.. ఆ తర్వాత వాల్తేరు వీరయ్యకు కూడా అదే స్థాయిలో రెమ్యునరేషన్‌ పుచ్చుకున్నారట.


ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవి రెమ్యునరేషన్‌ వివరాలు

అయితే వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించడంతో తన పారితోషికాన్ని పెంచేశారట మెగాస్టార్‌. భోళా శంకర్‌ చిత్రానికి దాదాపు రూ.65 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు సమాచారం.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఈ ఎఫెక్ట్‌ చిరంజీవి తదుపరి చిత్రంపై కచ్చితంగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి చిత్రానికి రెమ్యునరేషన్‌ తగ్గించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

(ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top