
అమ్మ ట్రాన్స్ ప్లాంట్‌కు పతకాలు పూశాయి
వరుణ్ ఆనంద్ చిన్నప్పటినుంచి ఆటల్లో చురుగ్గా ఉంటాడు. తిండి, నిద్ర కన్నా ఆటలే ముఖ్యం అతనికి. అలాంటి వరుణ్ అనుకోకుండా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి బారినపడ్డాడు. దాంతో ఆటల మాట దేవుడెరుగు... కనీసం తన పనులు కూడా తాను చేసుకోలేనంతటి దుస్థితికి వచ్చాడు. ఆ పరిస్థితుల్లో వారికి అనికా అనే ఆర్గాన్ డొనేషన్ సంస్థ జీవితాన్నిచ్చింది. అంతేకాదు, అతను ఆ వ్యాధి మూలంగా ఏ ఆటల నుంచి అయితే దూరం అయ్యాడో, అవే ఆటల పోటీల్లో అతను మరింత ఉత్సాహంగా పాల్గొని మూడు స్వర్ణ పతకాలను గెలుచుకున్నాడు. ఈ విజయం వెనుక వరుణ్ ఆనంద్ తల్లి ప్రోత్సాహంతోపాటు ఆమె కొడుక్కు పంచి ఇచ్చిన కిడ్నీ కూడా ఓ కారణం.
ఆరేళ్ల క్రితం ఓ రోజు.. బెంగళూరు అబ్బాయి వరుణ్ ఆనంద్ ఉన్నట్టుండి ఫుట్‌బాల్ గ్రౌండ్ నుంచి ఇంటికొచ్చేశాడు. ‘‘అదేంట్రా అప్పుడే వచ్చేశావ్?’’ అని తల్లి అడిగితే ‘‘బాగా అలసటగా ఉంది. ఆడాలనిపించడం లేదు. అందుకే వచ్చేశా’ అని నీరసంగా చెప్పాడు. ఆటలో పడితే తనను తానే మరిచిపోయే తన కొడుకు ఇలా చెప్పేసరికి అతని అమ్మ దీపకు జరగరానిదేదో జరగబోతోందన్న భయం, సందేహం అతలాకుతలం చేశాయి. తగ్గట్టే నెమ్మదిగా వరుణ్ ఆటకు దూరమయ్యాడు. కనీసం తన పనులు కూడా చేసుకోలేనంత బలహీనంగా తయారయ్యాడు. ఏ పనీ చేయకుండా ఊరికే తిని పడుకుంటున్నా సరే ఎప్పుడూ అలసటగా కనిపించేవాడు. దీనికి తోడు విడువని జ్వరం..కాళ్ల వాపులు...ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో చిరుతలా కదిలే వరుణ్ ఎముకలు బలహీనంగా మారడం తో తప్పటడుగులకు కూడా కష్టపడేవాడు. ఇదంతా చూస్తున్న అమ్మానాన్నలు అతడి భవిష్యత్తు గురించి బెంగటిల్లుతుండేవారు.
ఇంతలో జరగకూడదనుకున్నదే జరిగింది. ఓ రోజు మాటాపలుకూ లేకుండా పడిపోయాడు వరుణ్. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ పిల్లాడిని పరీక్షించారు. వరుణ్ బీపీ చాలా తక్కువగా చూపిస్తోంది. దాదాపు కోమాలో ఉన్నాడు. వెంటనే కొన్ని ఎమర్జెన్సీ టెస్టులు చేయించారు. వాటిలో అతడికి క్రానికల్ కిడ్నీ డిసీజ్ ఉన్నట్లు బయటపడింది. వరుణ్ కండిషన్ ను గురించి అతని తల్లిదండ్రులకు చె΄్పారు డాక్టర్. చివరకు వరుణ్ ఇప్పుడున్న స్థితికి అతడికి హీమో డయాలసిస్ చేసి కిడ్నీ మార్చడం తప్ప మరో దారి లేదని చెప్పారు. చెప్పిందే తడవుగా కిడ్నీ ట్రాన్స్ ΄్లాంటేషన్ కోసం సిద్ధమయ్యారు. దాతల గురించి వెతకసాగారు. ఈ క్రమంలో వారికి తెలిసిన విషయం... ఇంత బాధలోనూ అందరికీ ఆనందం కలిగించిన విషయం ఒకటే. వరుణ్‌కు తల్లి కిడ్నీ సరిగ్గా మ్యాచ్ కావడం. ఆపరేషన్ సక్సెస్ కావడం..
రెండేళ్ల క్రితం.. పెర్త్ వరల్డ్ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్ ఎరీనా కొత్త వరుణ్ అప్పుడు ఫుట్‌బాల్‌ను మాత్రమే వదిలేశాడు. 12, 14 ఏళ్ల విభాగంలో మరి ఇప్పుడు మూడు క్రీడా విభాగాలు టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, టెన్నిస్‌ల ప్రత్యర్థులను చిత్తు చేసి 3 స్వర్ణాలతో విన్నింగ్ స్మైల్‌తో డయాస్ మీద గర్వంగా నిలుచున్నాడు. ఇదతనికి మరో జీవితం. వీరందరి కన్నా ముందే అనికా ఈ పోటీల్లో పాల్గొంది. ఇది సాటిలేని అనుభవమని ఆమె చెబుతుంది. అనికా ఆర్గాన్ ఇండియా వ్యవస్థాపకురాలు. ఇది లాభాపేక్ష లేని సంస్థ. అనికా తల్లికి కూడా గుండెమార్పిడి ఆపరేషన్ జరిగింది. ఒక రకంగా దాని నుంచే ఆమె స్ఫూర్తి పొందింది. అనికా సంస్థ 2023లో ప్రపంచ ట్రాన్స్‌ప్లాంటేషన్ గేమ్స్‌లో టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. ‘‘మా అమ్మ ఆపరేషన్ సమయంలో నాకు ఎలాంటి ఆసరా, ట్రాన్స్ ప్లాంటేషన్‌గురించిన సమాచారమూ అందుబాటులో లేదు. అందుకే నేను ఆర్గాన్ ఇండియాను స్థాపించాను. ఇప్పుడు నేను నాలా ఎవరూ సమస్యలతో సతమతం కాకుండా చూసుకుంటున్నాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెబుతుందామె.

ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్
1978 నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జర్మనీలో 25వ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్ జరిగాయి. 51 దేశాల నుంచి 17 క్రీడాంశాల్లో పోటీ పడ్డారు. ఈ పోటీలకు అర్హతలు ఒకటి అభ్యర్థులు నాలుగేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారై ఉండాలి. అలాగే వారు ప్రాణాధార అల్లోగ్రాఫ్ట్‌లు (గుండె, పేగు, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్) అలాగే బోన్ మ్యారో మార్పిడి వంటి క్లిష్టమైన ఆరోగ్య సమస్యలనుంచి బయటపడి ప్రస్తుతం మామూలు జీవితం గడుపుతూ తాము పాల్గొనే ఈవెంట్లలో శిక్షణ పొంది ఉండాలి. ఆర్గాన్ ఇండియా ద్వారా వరుణ్ ఫ్యామిలీకి ఈ పోటీల గురించి తెలిసింది. అనికా తన ఆర్గాన్ ఇండియా సంస్థ ద్వారా వరుణ్ లాంటి ఎంతోమందికి జీవితంపై ఆశలు కల్పిస్తోంది. చికిత్స విషయంలో సహాయపడుతోంది. 2023లో ట్రాన్స్ ప్లాంటేషన్ గేమ్స్‌లో వరుణ్ ప్రతిభను చూసి అనికా ఆశ్చర్యపోయింది. ‘32 మంది సభ్యుల టీమ్ ఇండియా బృందంలో అతనే చిన్నవాడు. కానీ తన శక్తితో దానిని నడిపించాడు.