బెంగళూరు బోయ్‌..​ అమెరికా అమ్మడు : ఓ అందమైన ప్రేమకథ | A Bengaluru desi boy fairytale love story with American woman melts hearts | Sakshi
Sakshi News home page

బెంగళూరు బోయ్‌..​ అమెరికా అమ్మడు : ఓ అందమైన ప్రేమకథ

Jul 14 2025 5:48 PM | Updated on Jul 14 2025 5:53 PM

A Bengaluru desi boy fairytale love story with American woman melts hearts

‘‘బెంగళూరు బోయ్‌..​ అమెరికా అమ్మడు" వీరి నిజ జీవిత  ప్రేమగాథ ఇది సోషల్ మీడియా ద్వారా మొదలై, సరిహద్దులు దాటిన ప్రేమగా నిలిచింది. తొలి చూపులోనే  ఏదో తెలియని  ఆకర్షణ, సప్త సముద్రాల అవల ఉన్నా చేరువ కావాలనుకున్నారు. నా ప్రతి శ్వాసవి నువ్వే..అన్నట్టు ఊసులాడుకున్నారు. కట్‌ చేస్తే.. ఇదే అందమైన ప్రేమకథగా సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పదండి ఈ ఇంట్రస్టింగ్‌  లవ్‌ స్టోరీ గురించి తెలుసుకుందాం.


హ్యూమన్స్ ఆఫ్ బాంబే  షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రకారం సోషల్ మీడియా ద్వారానే  లవ్‌బర్డ్స్‌   బెంగళూరుకు  అబ్బాయి, అమెరికా అమ్మాయి పరిచయం, ప్రేమకు దారితీసింది.. ప్రతీక్షణం టచ్‌లో ఉన్నారు ఒకరి అభిప్రాయాలను పంచుకున్నారు.  వీడియో కాల్స్‌ వర్చ్యవల్‌ డిన్నర్స్‌. ఇక  విడిగాబతకలేమని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అంతే ఆ అమ్మాయి అమెరికా నుండి ఇండియాకు వచ్చేసింది. ఆఅబ్బాయి పేరే దీపక్‌. అమ్మాయిపేరు హన్నా.

 ఆర్టిస్ట్‌ దీపక్‌ 2023, ఏప్రిల్‌లో ఒక ప్రదర్శన కోసం ముంబైకి వెళ్ళినప్పుడు హన్నా అమ్మాయిని చూశాడు. తొలిచూపులోనే హన్నాపై ఇష్టం పెంచుకున్నాడు. మొత్తం మీద ధైర్యం చేసి మాటకలిపాడు. ముంబైలో ఆ కాసేపటి  పరిచయంతో ఆశ్చర్యంగా ఇద్దరూ స్నేహితులైపోయారు. ఇద్దరూ ఫోన్‌ నెంబర్లు పంచుకున్నారు. ఇక అప్పటినుంచి వీరి ప్రణయ గాథకు అడుగులు పడ్డాయి. తమ  స్నేహం కేవలం ఆకర్షణ  కాదు అంతకుమించి అని దీపక్‌ ఫిక్స్‌ అయిపోయాడు.
 

మనుషులు దూరమైనా..మనసులు దగ్గరే!
ఇంతలో ఆమె ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా, వారి కమ్యూనికేషన్ ఎప్పుడూ ఆగలేదు. రోజువారీ సందేశాలు, తరచు కాల్స్‌, ఎన్నో ఆలోచనలు, మరెన్నో అభిప్రాయాలు వారి బంధాన్ని మరింత పటిష్టం చేశాయి. నెమ్మదిగా వారి స్నేహం ప్రేమగా వికసించింది. త్వరలోనే అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్న సమయంలో తన భావాలతో కూడిన భావోద్వేగ పెయింటింగ్‌ను అందించాడు. అంతే ఆమె కూడా ఫిదా అయిపోయింది.

కానీ హన్నా అమెరికాకు వెళ్లిపోయింది. ఆ దూరం వారిద్దరి మధ్యా ప్రేమ  మరింతపెరిగింది. చివరికి దీపక్‌ తన తల్లితో తన ప్రేమ గురించి  చెప్పాడు. హన్నా  ఫోటో చూడగానే తల్లి తక్షణమేఅంగీకరించింది. అటు హన్నా కూడా తన  ప్రియుడిని తన కుటుంబానికి పరిచయం చేసింది. భాషా అంతరాలు ఉన్నప్పటికీ  పరస్పరం అంగీకరించారు.

ఒక సంవత్సరం తర్వాత
ఫిబ్రవరి 2024లో తల్లిదండ్రులతో కలిసి ఇండియాకు వచ్చింది హెన్నా.  విమానాశ్రయంలో ఆత్మీయంగా హెన్నాను ఆలింగనం చేసుకున్న క్షణం ఇక విడిచి ఉండటం కష్టమని   నిర్ణయించు కున్నారు. ఆ హగే వారి జీవితంలో కీలక నిర్ణయానికి నాంది పలికింది.  అదే ఏడాది జూలై 26న అందమైన  ఎర్రచీరలో పెళ్లి కూతురిలా ముస్తాబైంది హన్నా. సన్నిహితుల సమక్షంలో ఇద్దరూ అపురూపంగా  పెళ్లి చేసుకున్నారు.

జీవితంలో మొదలైన అందమైన మలుపు ఎంతో హృద్యంగా సాగిపోతోంది. ఒ‍కరి ప్రపంచంలో ​ఒకరిగా మారిపోయారు. దీపక్‌ తల్లి హన్నాకు సాంప్రదాయ భారతీయ ఆహారాన్ని ఎలా తయారు చేయాలో నేర్పిస్తోంటే,  హన్నా పాశ్చాత్య వంటకాలను పరిచయం చేసింది.   

ఈ ‍ప్రేమికుల పెళ్లి ఇద్దరు వ్యక్తుల కలయికను కాదు, రెండు విభిన్న సంస్కృతులు, ఆచారాలు, హృదయాలను కలయిక. వీరి అందమైన లవ్‌స్టోరీకి త్వరలోనే తొలి వసంతం నిండబోతోంది. ప్రేమ పెళ్లికి దేశం, ప్రాంతం, భాషా ఇలాంటివేవీ అడ్డురావని నిరూపించారు. దీపక్  ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం 93 వేలకు పైగా అనుచరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement