
ఫ్యూచర్ టెన్స్
యూనివర్శిటీ, కాలేజీ విద్యార్థుల స్టార్టప్‌ల గురించి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు యూనివర్శిటీ, కాలేజీల నుంచి మాత్రమే కాదు ఉన్నత పాఠశాలలు కూడా స్టార్టప్ ఐడియాలకు కేంద్రం అవుతున్నాయి. ఇటీవల దిల్లీ–ఎన్‌సీఆర్ విద్యార్థి సదస్సులో పాల్గొన్న విద్యార్థులు డెమో యాప్‌ల గురించి వివరించడంతోపాటు తమ ఫ్యూచర్ స్టార్టప్‌లకు సంబంధించి ఆలోచనలు పంచుకున్నారు. వారి మాటల్లో ఉత్సాహం మాత్రమే కనిపించలేదు. నిర్మాణాత్మక ప్రణాళిక కనిపించింది.
నో–కోడ్ టూల్స్, ఏఐ అసిస్టెంట్స్, గ్లోబల్ బ్యాంక్ రిసోర్స్ ఇన్‌స్టంట్ యాక్సెస్... మొదలైన కారణాల వల్ల గతంతో పోల్చితే స్టార్టప్ ఆలోచన పట్టాలు ఎక్కించడం సులభం అయింది. స్టార్టప్‌లను ఎలా నిర్మించాలి, అస్థిరపరిస్థితులను ఎలా అధిగమించాలి, ఇతరులతో ఎలా కలిసి పనిచేయాలి, ఒకవేళ ఫెయిల్యూర్ ఎదురైతే దానిని అధిగమించి తిరిగి ఎలా వెనక్కి రావాలి... మొదలైన విషయాల గురించిపాఠ్యపుస్తకాల నుంచి నేర్చుకోనప్పటికీ వాటిపై హైస్కూల్ స్థాయి విద్యార్థులకు తగినంత అవగాహన ఉండడం విశేషం.
చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు
తమ కలలను సాకారం చేసుకోవడానికి స్కూల్‌లో నిర్వహించే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక సమస్యలు, పర్యావరణహిత ఆలోచనల ఆధారంగా స్టార్టప్ ఆలోచన చేస్తోంది యువతరం.
ఇదీ చదవండి: ఖరీదైన పెళ్లి : 11.5 కిలోల వెడ్డింగ్ గౌను, గోల్డ్‌బాక్స్ రిటన్ గిఫ్ట్స్