
బరువు తగ్గడం అనేది చాలామందికి అనుకున్నంత ఈజీకాదు. వెయిట్ లాస్ ప్లాన్లు, చిట్కాలు, టిప్స్, వ్యాయామాలు, ఆహార నియమాలు సోషల్‌మీడియాలో ఎన్నో విషయాలు గందరగోళంగా ఉంటాయి. ఎన్ని ఉన్నా.. మన శరీరం, దాని తీరు, ఆరోగ్యాన్ని బట్టి మనం ఉత్తమ మార్గాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో సమతుల్య ఆహారం తీసుకోవడాన్ని మించింది లేదు. దీంతో పాటు కనీసం వ్యాయామం, కంటినిద్రా ఉంటే చాలు. మరి ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా వెయిట్ పెరగకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి? ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో చూద్దాం. ఇవి బరువును తగ్గించడంలో సహాయపడటమే కాదు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి.
శుద్ధి చేసిన పిండి పదార్థాలు
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినే వారి కంటే తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలు ఉన్న వ్యక్తులు ఎక్కువ బరువు కోల్పోయారని ఇటీవలి అధ్యయనం నిర్ధారించింది. వేగంగా బరువు తగ్గాలంటే చక్కెర, పిండి పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే తక్కువ కార్బ్ ఆహారం తీసుకోవడం ద్వారా లేదా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తద్వారా ఆకలి తగ్గుతుంది, తక్కువ ఆక కేలరీలు తినగలుగుతారు. తక్కువ కార్బ్ ఆహారం శరీరం శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును కరిగించడానికి సాయపడుతుంది. ఫైబర్ పుష్కలంగా లభించి జీర్ణక్రిను మెరుగుపర్చి బరువును తగ్గిస్తుంది.
చదవండి: నో టికెట్.. నో మనీ : విమానం ల్యాండింగ్ గేర్ పట్టుకుని ఢిల్లీకి వచ్చిన ఆఫ్ఘన్ బాలుడు
హై ప్రోటీన్ ఫుడ్
బరువు తగ్గించే ప్రయాణంలో తగినంత ప్రోటీన్లు తినడం వల్ల కండర ద్రవ్యరాశిని కాపాడుకోవచ్చు. కార్డియోమెటబాలిక్ ప్రమాద కారకాలు, శరీర బరువు ,ఆకలిపై ప్రోటీన్ సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. తగినంత ప్రోటీన్ ఉన్న ఆహారం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, కోరికలను తగ్గిస్తుంది. చికెన్, లాంబ్, పంది మాంసం, సాల్మన్, సార్డినెస్, ట్రౌట్, గుడ్లు, రొయ్యలు, బీన్స్, టోఫు, టెంపే, క్వినోవా మరియు చిక్కుళ్ళు వంటి ఆరోగ్యకరమైన ప్రోటీన్ వనరులతో మీరు మీ ఆహారాన్ని మెరుగుపరచుకోవచ్చు.
బరువు తగ్గించే ఆహారంలో ఆకుకూరలు మరొక గొప్ప సోర్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేలరీలు చాలా తక్కువగా పోషకాలు, కార్బోహైడ్రేట్లు మెండుగా లభిస్తాయి. బరువు తగ్గించే ఆహారంలో తప్పనిసరిగా చేర్చాల్సిన కూరగాయల్లో టమోటాలు, దోస, బీర, సొరతోపాటు, బ్రోకలీ, పాలకూర, కాలీఫ్లవర్,క్యాబేజీ, బ్రస్సెల్స్ తీసుకోవచ్చు. మొలకలు, లెట్యూస్, స్విస్ చార్డ్, మిరియాలు లాంటివి మన ఆహారంలో చేర్చు కోవచ్చు. అయితే చిలగడదుంపలు, బంగాళాదుంపలు, మొక్కజొన్న లాంటి వాటిల్లో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువ. వీటివలన ఎటువంటి హాని లేనప్పటికీ, పోర్షన్ కంట్రోల్ పాటించడం మంచిది.
ఆరోగ్యకరమైన కొవ్వులు అస్సలు మిస్ కాకూడదు
అవకాడో నూనె, ఆలివ్ నూనె, పొద్దుతిరుగుడు నూనె, కనోలా నూనె లాంటి ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆయిల్. పొద్దుతిరుగుడు, గుమ్మడికాయ, చియా, మఅవిసె గింజలు గింజలు , బాదం వాల్‌నట్‌లు వీటిని మితంగా తీసుకోవచ్చు. వీటితోపాటు రుచికరమైన కూరగాయలు, గింజలకలిపి సలాడ్‌ను తినవచ్చు.
ఇదీ చదవండి: గోంగూర పువ్వులతో వంటలు, అద్భుత ప్రయోజనాలు
గుర్తుంచుకోవాల్సిన అంశాలు.
ఏదైనా డైట్ ఎంచుకునే ముందు అది మనకు సరిపడుతందో లేదో నిర్ధారించుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి. ఎంచుకునే ఆహారం మరీ నిర్బంధంగా ఉండకుండా చూసుకోండి. లేదంటే నియంత్రణ కోల్పోతే అతిగా తినేసే అవకాశం ఉంది. పోషకాలు అందుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. బరువు తగ్గడంలో పట్టుదల చాలా కీలకం. పట్టుదలగా ఆహార నియమాలనుపాటించాలి. జీవనశైలికి అనుగుణంగా శక్తినిచ్చే ఆహరాన్ని ఎంచుకోవడంతో పాటు, క్రమం తప్పని వ్యాయామం తప్పనిసరి. రోజుకు కనీనం 3-4 లీటర్లు నీళ్లు తాగడం, 8 గంటల నిద్ర, ఒత్తిడి లేని జీవితం వెయిట్ లాస్ జర్నీలో కీలక పాత్ర పోషిస్తాయి.
నోట్ : పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహనకోసం అందించినవి మాత్రమే. ముఖ్యమైన నిర్ణయాలు, సందేహాల నివృత్తికోసం వైద్యులను సంప్రదించండి.