
వర్షాకాలంలో మారుతున్న సీజన్ తేమ, ఉష్ణోగ్రత మార్పులను తెస్తుంది. ఈ మార్పులు అనేక చర్మ సమస్యలకు దారి తీస్తాయి. అయితే రసాయనలతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఆధార పడడం కాకుండా కొన్ని ఆయుర్వేద మూలికల ద్వారా చాలా చర్మ సమస్యలకు చెక్ చెప్పవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్‌ది డేలో భాగంగా అవేంటో చూద్దాం.
ఆయుర్వేదం ప్రకారం, రుతుపవనాల సమయంలో వచ్చే కాలానుగుణ మార్పులు దోషాలను - ముఖ్యంగా వాత, పిత్త - తీవ్రతరం చేస్తాయి . మొటిమలు లేదా దద్దుర్లు వంటి చర్మ సమస్యలకు దారితీస్తాయి.
ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ మధుమిత కృష్ణన్ చర్మ సమస్యల నివారణ, మొటిమలు నివారణ, చక్కగా మెరిసే చర్మాన్ని కలిగి ఉండటానికి తీపి పదార్థాలు, పోషక బాదం నుండి త్రిదోష సమతుల్య ఆమ్లా వరకు ఐదు ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లను సిఫార్సు చేస్తున్నారు.
బాదం: బాదం రుచిలో తీపిగా ఉంటాయి. వాత , పిత్త దోషాలను సమతుల్యం చేస్తాయి. ఇవి కొద్దిగా జిడ్డుగా ఉండటం వల్ల చర్మాన్ని లోపలి నుండి పోషించడానికి పరిపూర్ణంగా ఉంటాయి. ఆయుర్వేదం, సిద్ధ ,యునాని గ్రంథాల ప్రకారం వర్షాకాలం అంతటా బాదం చర్మమెరుపునకు, ఆరోగ్యానికి మంచిది. రాత్రంతా నానబెట్టడం వల్ల మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది . లోతైన చర్మ పోషణను అందిస్తుంది.
పసుపు: ఈ బంగారు సుగంధ ద్రవ్యాన్ని తరతరాలుగా వాడుతున్నారు. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియనె మెరుగుపర్చి, వాత దోషాన్ని చర్మానికి సరైన సమతుల్యం చేయడానికి అద్భుతమైన మార్గం. సాధారణ భోజనంలో పసుపును చేర్చుకోవడం ద్వారా, తరచుగా మొటిమలు ,మొటిమలకు కారణమయ్యే మంటను తగ్గించుకోవచ్చు. పసుపు ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
ఆమ్లా (భారతీయ ఉసిరి) : అన్ని త్రిదోషాలను సమతుల్యం చేసే ఆమ్లా, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది. శక్తినిస్తుంది. శరీరం నుండి మలినాలను తొలగించడం ద్వారా, దాని నిర్విషీకరణ లక్షణాలు వర్షాకాలంలో మొటిమలు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.
వేప: మొటిమలు లేని చర్మానికి ఆయుర్వేదంలో అత్యంత నమ్మదగిన చికిత్సలలో ఒకటి వేప. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,రక్త శుద్ధి లక్షణాల మెండుగా ఉంటాయి.
వెల్లుల్లి: వెల్లుల్లిలోని వాత బ్యాలెన్సింగ్ లక్షణాలు దాని బలమైన రుచి ఉన్నప్పటికీ లోపలి నుండి పనిచేస్తాయి. ఇవి సహజమైన, చర్మాన్ని శుభ్రపరిచే సూపర్‌ఫుడ్ వెల్లుల్లి.
నోట్... చర్మ ఆరోగ్యం, అందం పైపైనదిగా మాత్రమే ఉండదు. ఆయుర్వేదం మనకు బోధించినట్లుగా, నిజమైన అందం లోపలి నుండే ప్రారంభమవుతుంది. కాలిఫోర్నియా బాదం వంటి గింజలు ,పసుపు వంటి సుగంధ ద్రవ్యాలను చేర్చడం వల్ల ఈ తేమ వాతావరణంలో కూడా మెరుస్తున్న చర్మం మన సొంతం. ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో మొటిమలకు వీడ్కోలు చెప్పేద్దాం.