శీతాకాలం వచ్చిందంటే చర్మానికే కాదు.. జుట్టుకూ సమస్యలు చుట్టుకున్నట్టే! చల్లని గాలులు, గాలిలో తేమ లేకపోవడం వల్ల ఈ సమయంలో జుట్టు రాలడం పెరుగుతుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే జుట్టుకు లోపల నుండి బలం, ఆరోగ్యం అవసరం. రాలిపోయిన తల వెంట్రుకలు తిరిగి పెరగడాన్ని ప్రేరేపించడానికి, ఫాలికిల్స్‌ను బలోపేతం చేయడానికి సహజ మెరుపును అందించ డానికి సహాయపడే అద్భుత ΄ానీయం ఒకటి ఉంది.. అదేంటో చూద్దాం..
ఉసిరి, అల్లం, కరివేపాకుతో చేసిన ఒక జ్యూస్ మీ జుట్టు సమస్యకు సహజ నివారణ. ఈ మూడు పదార్థాలు వాటి అద్భుతమైన వైద్య విలువల వల్ల ఆయుర్వేద ఔషధాలుగా చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు.

ఇందుకోసం ఏం చేయాలంటే...
ఉసిరి, అల్లం ముక్క, కరివేపాకు, బెల్లం, మిరియాలు తీసుకోవాలి. ముందుగా రెండు ఉసిరికాయలను బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు అల్లం తొక్క తీసి అందులో వేయండి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి. రుచికోసం కొద్దిగా బెల్లం, 2 మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇందులో కొన్ని నీళ్లుపోసి మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయండి. దీనిని వడబోసి రసం ఓ గ్లాసులోకి తీసుకుని కళ్లు మూసుకుని తాగేయడమే!
ఇదీచదవండి: స్మృతి-పలాష్ పెళ్లిలో మరో ట్విస్ట్ : ఇన్‌స్టాలో అప్‌డేట్ చూశారా?
ఉసిరి, అల్లం, కరివేపాకు జుట్టుతో పాటు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లు, చర్మాన్ని లోతు నుంచి శుభ్రం చేస్తాయి. తద్వారా వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు, జుట్టు తెల్లబడి వయసు పెరగకుండా ఉండాలనుకునే వారు రోజూ ఈ జ్యూస్ తాగడం మంచిది. మూడు వారాలు ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.


