
ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ బ్లాక్ హెడ్స్ వస్తూనే ఉంటాయి. వీటివల్ల ముఖం కళావిహీనంగా కనిపిస్తుంది. వీటిని తీయించుకోవడం ఖర్చుతో కూడుకున్నదేగాక, సమయం కూడా వెచ్చించాలి. అయితే ఇంట్లో ఉండే దాల్చినచెక్క, నిమ్మ, పప్పు, పాలు, పంచదార, కొబ్బరి నూనె, ఉప్పుతో సులభంగా తొలగించుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం...
చర్మంలో అతిముఖ్యమైన ప్రొటిన్ కొల్లాజెన్ విడుదలను మెరుగుపరచడంలో దాల్చినచెక్క ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మం మీద ఏర్పడే రంధ్రాలను దాల్చిని తగ్గిస్తుంది. నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంమీద రంధ్రాలను లోతుగా శుభ్రం చేస్తాయి. అందువల్ల అరచెక్క నిమ్మరసంలో టీస్పూను దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో పూతలా వేసి పదిహేను నిమిషాల పాటు మర్దనా చేయాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.
స్పూను పంచదారలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెవేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు మర్దన చేసి తరువాత కడిగేయాలి. పంచదార చర్మాన్ని లోతుగా శుభ్రంచేసి మూసుకు పోయిన రంధ్రాలను తెరవడంతో పాటు, మృతకణాలను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, మృదువుగా మారుస్తాయి.
అరచెక్క నిమ్మరసంలో అరటీస్పూను సాల్ట్‌వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాల΄ాటు మర్దన చేసి చల్లని నీటితో కడిగేయాలి. ఈ స్క్రబ్ వదులుగా ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడంతోపాటు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి చర్మం కాంతిమంతం గా మెరిసేలా చేస్తుంది.
ఇదీ చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..
డార్క్ సర్కిల్స్
టీ స్పూన్ టొమాటో గుజ్జు, సెనగపిండి, చిటికెడు పసుపు, అర టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కళ్ల మీద గుండ్రంగా తరిగిన కీరా ముక్కలు ఉంచి ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే కళ్ల కింద నల్లని వలయాలు తగ్గుముఖం పట్టి, ముఖం కాంతిమంతం అవుతుంది.
నోట్: ఆరోగ్యాన్ని మించిన అందంలేదు. సమతులం ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, సరిపడినన్ని నీళ్లు తాగడం, చక్కటి నిద్ర, ఒత్తిడి లేని జీవితం, నలుగురితో హాయిగా, సంతోషంగా నవ్వుతూ గడిపే జీవన శైలి,ఏదైనా అనారోగ్యసమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఇవి చాలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి.