
అవిసె గింజలు (Flax Seeds) ప్రాచీన కాలం నుండి ఆయుర్వేద వైద్యంలో వీటిని ఉపయోగిస్తున్నారు. ఆధునిక కాలంలో కూడా పోషకాహార నిపుణులు వీటి ప్రాముఖ్యతను గుర్తించి, రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అవిసె గింజల్లో పోషకాలు వాటివ కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.ఇవి చూడ్డానికి చిన్నగా కనిపించినా వీటిని సూపర్ ఫుడ్ అనిపిలుస్తారు. ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.
అవిసె గింజలు- అద్భుతాలు
అవిసె గింజలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, ప్రత్యేకంగా ఆల్ఫా-లినోలెనిక్ ఆసిడ్ (ALA) అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటును తగ్గించడం, చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
అవిసె గింజలు ఫైబర్ అధికంగా ఉటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేసి, బరువును నియంత్రణలో ఉంచడంలో దోహదపడుతుంది.
జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది, పేగుల కదలికలను క్రమబద్ధం చేస్తుంది.అవిసె గింజలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మధుమేహంతో బాధపడేవారికి చాలామంచిది. (భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడు)
అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి
అవిసె గింజలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.
అవిసె గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు కేన్సర్‌ను నిరోధిస్తాయి. “లిగ్నన్స్” అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొన్ని రకాల కేన్సర్ల, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో సహాయపడతాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.
అత్యధిక మొత్తంలో పాఅన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు (పీయూఎఫ్‌ఏలు), ముఖ్యంగా ఎఎల్‌ఎలు, ఉంటాయి కాబట్టి అవిసె గింజలు ఆరోగ్యదాయకమైన అనుబంధాహారంగా ప్రాచుర్యం పొందాయి.. ఎఎల్‌ఎ, లిగ్నాన్లు పుష్కలంగా ఉండటం మూలంగా అవిసె గింజలు గుండెకు మేలు చేస్తాయి.
రక్తపోటును తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలను, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి.
మెనోసాజ్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్దకం, మానసిక అలసటను తగ్గిస్తాయి. అవిసె గింజల పిండిని అనేక అనారోగ్యాలను తగ్గించడానికి అనాదిగా వాడుతున్నారు. అయితే, శ్యానోజెనిక్ గ్లైకోసైడ్స్, ట్రిప్సిన్ ఇన్‌హిబిటర్స్, ఫైటిక్ ఆసిడ్ వంటి యాంటీ న్యూట్రియంట్లు ఉన్నప్పటికీ.. మొత్తంగా చూస్తే అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నెరవేరతాయి.
అంతేకాదు ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా దోహపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. గాయాలను త్వరగా మానేలా చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి దోహదపడతాయి.
అవిసె గింజలను ఎలా ఉపయోగించాలి:
అవిసె గింజలను పొడిగా చేసి, సూప్ లు, సలాడ్ లు, పెరుగు లేదా స్మూతీలలో కలుపుకోవచ్చు.
అవిసె గింజల నూనెను కూడా ఉపయోగించవచ్చు.
అవిసె గింజలను నానబెట్టి, రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం తినవచ్చు. లైట్‌గా వేయించి, తేనె లేదా వెచ్చని నీటితో కూడా తీసుకోవచ్చు.
అవిసె గింజలను పచ్చిగా తినడం అంత మంచిది కాదు, ఎందుకంటే వాటిలోని పోషకాలు సరిగా జీర్ణం కావు. రోజుకు ఒకటి నుండి రెండు చెంచాల అవిసె గింజల పొడి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని వినియోగించేందుకు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం