
తెలియకుండానే రోజుకు కనీసం 500 కేలరీలు కట్
బరువు తగ్గాలి అంటే కచ్చితంగా కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలి. బరువు ఎందుకు ఎక్కువ ఉన్నామనే విషయాలను నిపుణుల సలహా మేరకు అంచనావేసుకోవాలి. ఆ తరువాత బరువు ఎంత? ఎలా తగ్గాలి అనే ప్రణాళిక వేసుకోవాలి. ఎక్కడా నిరాశ పడకుండా, ప్లాన్ ప్రకారం పూర్తి కమిట్‌మెంట్‌తో ఓపిగ్గా , స్మార్ట్‌గా ప్రయత్నిస్తే ఫలితం సాధించడం సులువే. ఈ విషయాన్ని అనేక మంది సెలబ్రిటీలు, ఫిట్‌నెస్ కోచ్‌లు చెబుతున్నమాట. చిన్న, చిన్న మార్పులతో పెద్ద పెద్ద ఫలితాలను ఎలా సాధించవచ్చో తాజాగా ఫిట్‌నెస్ కోచ్ వివరించారు.
తెలివిగా, వ్యూహాత్మకంగా ఉంటే బరువు తగ్గాలనే లక్ష్యాలను సాధించవచ్చు. చిన్న మార్పులు పెద్ద తేడాను ఎలా కలిగిస్తాయో ఫిట్‌నెస్ కోచ్ వివరించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా ఫిట్‌నెస్ సంబంధిత చిట్కాలను పంచుకునే జోష్ ఇటీవల కొన్ని చిట్కాల గురించి చర్చించారు. సిల్లీగా అనిపించినా ఇవి చాలా ప్రభావాన్ని చూపుతాయంటూ 6 ప్రధాన సూత్రాల గురించి వివరించారు.
కుడి చేతి వాటం వాళ్లు, ఎడం చేత్తో, ఎడం చేయి వాటం ఉన్న వాళ్లు కుడి చేత్తో తినాలి అంట. దీని వల్ల 30 శాతం తక్కువ తినడానికి ఆస్కారం ఉంటుంది. సిల్లీగా అనిపించినా ఇది ఫలితం ఇస్తుందంటున్నారు. ఒక భోజనంలో 150-300 కేలరీలు తగ్గించుకోవచ్చని చెప్పారు.
సాయంత్రం తొందరగా పళ్లుతోముకోవడం వల్ల ఇక తినడం అపేయాలనే సంకేతం మెదడుకు అందుతుందని, ముఖ్యంగా అర్థరాత్రి స్నాక్స్ తీసుకోనే అలవాటును మానుకోవడంలో ఇది గేమ్ ఛేంజర్‌లా పనిచేస్తుందని, తత్ఫలితంగా 200-600 కేలరీలను సులభంగా ఆదా చేయవచ్చని చెప్పారు.
మోసం చేసే లిక్విడ్ కేలరీస్.. మీరు నమ్మరు గానీ రోజుకు 2-3 కాఫీలు, వందల కేలరీలకు దారితీయవచ్చు,ఆల్కహాల్, క్రీమర్లు, స్మూతీలు... అవన్నీఇందలో కలిసిపోతాయి అంటాడు జోష్. వీటితో అప్రమత్తంగా ఉండాలంటాడు.
అలాగే డీప్ ఫ్రైయింగ్ ఆరోగ్యానికి హానికరమంటాడు. ఆయిల్ ఫుడ్‌తో చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు, బ్లడ్ షుగర్ లాంటి ప్రమాదకరమైన అనారోగ్యాల్ని పెంచుతుంది. దీనికి బదులుగా తక్కువ కేలరీల స్ప్రేని లేదా ఎయిర్ ఫ్రైయర్‌ను ఎంచుకోండి అంటాడీ ఫిట్‌నెస్ కోచ్
భోజనానికి ముందు ఒక గ్లాసు నిమ్మకాయ నీరు, తక్కువ కేలరీల పళ్ల రసం తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!
బరువు తగ్గడంలో పోర్షన్ కంట్రోల్ చాలా ముఖ్చమని, సరైన ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టిపెట్టాలని చెప్పాడు. తక్కువ కేలరీ ఫుడ్‌తో పొట్టను నింపేయాలి అంటాడు. ముఖ్యంగా సెలెరీ, దోసకాయ, గెర్కిన్స్, టమోటాలు, క్యాబేజీ, ఆకుకూరలులాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటాడు.
నోట్: ఫిట్‌నెస్ కోచ్ ఇన్‌స్టా ఐడీ ఆధారంగా అందించిన టిప్స్ మాత్రం అని గమనించగలరు. వీటితోపాటు కార్డియో, కఠినమైన ఇతర వ్యాయామాలను కూడా ఇక్కడ గమనించవచ్చు. బరువు తగ్గడం అనే ప్రక్రియలో ఎవరికి వారు ఆలోచించి, వైద్యులు సలహా మేరకు ముందుకు సాగాలి