
సారా అలీ ఖాన్ (Sara Ali Khan) సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు. అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్‌ల కుమార్తె. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన సారా తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకుంది. కొలంబియా యూనివర్శిటీ నుండి హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్‌లో పట్టా పొందింది. ఆతరువాత నటనా రంగంలోకి అడుగు పెట్టి బస్టర్ హిట్స్ తో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 'కేదార్‌నాథ్' 'అత్రంగి రే', ఇంకా వెబ్‌సిరీస్‌లతో అదరగొట్టేసింది. సారా అలీ ఖాన్ కొత్త చిత్రం మెట్రో... ఇన్ దినోం మంచి పేరే తెచ్చుకుంది. అయితే సినిమాల్లోకి రావడానికి ముందు 96 కిలోల బరువు, PCOS సమస్యలతో బాధపడిన డైట్, వర్కౌట్స్‌తో 47 కిలోలకి తగ్గింది. ఈ జర్నీకి సంబంధించిన వివరాలు తాజాగా పంచుకుంది.
సారా అలీ ఖాన్ కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా 91 కిలోల నుండి 46 కిలోలకు తన బరువును తగ్గించుకుంది. ముఖ్యంగానో-షుగర్ ,నో-మిల్క్ డైట్ ప్లస్ కార్డియోతో తాను 45 కిలోల బరువు తగ్గానని వెల్లడించింది. సినిమాలు, నటన పట్ల ప్రేమతో నటిగా స్థిరపడాలనే లక్ష్యంతో సారా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. ఇందుకు సహాయపడే కొన్ని జీవనశైలిలో మార్పులు చేసుకుంది. ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా PCOS ఉన్న అమ్మాయిలు- హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే, అధిక బరువుతో ఇబ్బంది పడతారు. ఈ క్రమంలో హార్మోన్ల కారణంగా బరువు తగ్గడం చాలా కష్టతరం అయినప్పటికీ సారాదృఢ సంకల్పం, అంకితభావంతో కృషి చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం, కార్డియో, కఠిన వ్యాయామాల మిశ్రమంతో దాదాపు 45 కిలోల బరువు తగ్గింది. అలా 96 కిలోల నుండి 51 కిలోలకు చేరుకోవడం విశేషం.
సారా అలీ ఖాన్ వెయిట్ లాస్ జర్నీ
రణవీర్ అల్లాబాడియా అకా బీర్‌బైసెప్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో, సారా అలీ ఖాన్ తన బరువు తగ్గడం గురించి తెలిపింది. సినిమాలలో నటించాలంటే దర్శకుడు కరణ్ జోహార్ 'సగం' బరువు తగ్గించమని కోరాడని అదే తనకు ప్రేరణ అని తెలిపింది. అమెరికాలో బాగా జంక్ ఫుడ్‌కు అలవాటు పడిన సారా షుగర్, జంక్ ఫుడ్, నూనెలో వేయించిన స్నాక్స్ పూర్తిగా దూరం పెట్టేసింది. ఇంటి,హెల్తీ ఫుడ్‌కే ప్రాధాన్యత ఇచ్చింది. చక్కెర, పాలు, కార్బోహైడ్రేట్లు లేని ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేది. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండేలా నీళ్లు, ముఖ్యంగా జీలకర్ర, కొత్తిమీర నీళ్లు వంటివి తాగేది.

వ్యాయామాల్ని కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేది. ఇందులో యోగా ,డ్యాన్స్ కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఆమె గంటకుపై ట్రైనింగ్ తీసుకునేది. ఒక విధంగా చెప్పాలంటే వ్యాయామాన్ని ఒక పనిగా కాకుండా అదే రోజువారీ ప్రాధాన్యతగా మార్చుకుంది. ఇంత బరువు తగ్గినా ఇప్పటికీ తన బరువుతో సమస్యలను ఎదుర్కొంటున్నానని చెప్పింది. బాడీ పెరుగుతోంది. ముఖం పెద్దగా మారింది.. ఏమి తింటున్నానో చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువుతో అదుపులో ఉంచుకోవడం ఉండటం తనకు చాలా ముఖ్యమని చెప్పుకొచ్చింది. తనకు సంబంధించి బరువు తగ్గడం కెరీర్ కోసం మాత్రమేకాదు, శారీరక, మానసిక శ్రేయస్సు కోసం కూడా. PCOSను తగ్గించుకోవడం, తన ఆత్మవిశ్వాసానికి, జీవితంలో స్పష్టత రావడానికి బరువు తగ్గడం అనేది చాలా సాయపడిందని వెల్లడించింది.