breaking news
Flax seeds
-
అవిసె గింజలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
అవిసె గింజలు (Flax Seeds) ప్రాచీన కాలం నుండి ఆయుర్వేద వైద్యంలో వీటిని ఉపయోగిస్తున్నారు. ఆధునిక కాలంలో కూడా పోషకాహార నిపుణులు వీటి ప్రాముఖ్యతను గుర్తించి, రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అవిసె గింజల్లో పోషకాలు వాటివ కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.ఇవి చూడ్డానికి చిన్నగా కనిపించినా వీటిని సూపర్ ఫుడ్ అనిపిలుస్తారు. ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అవిసె గింజలు- అద్భుతాలుఅవిసె గింజలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, ప్రత్యేకంగా ఆల్ఫా-లినోలెనిక్ ఆసిడ్ (ALA) అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటును తగ్గించడం, చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.అవిసె గింజలు ఫైబర్ అధికంగా ఉటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేసి, బరువును నియంత్రణలో ఉంచడంలో దోహదపడుతుంది.జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది, పేగుల కదలికలను క్రమబద్ధం చేస్తుంది.అవిసె గింజలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మధుమేహంతో బాధపడేవారికి చాలామంచిది. (భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడు)అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి అవిసె గింజలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.అవిసె గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు కేన్సర్‌ను నిరోధిస్తాయి. “లిగ్నన్స్” అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొన్ని రకాల కేన్సర్ల, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో సహాయపడతాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.అత్యధిక మొత్తంలో పాఅన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు (పీయూఎఫ్ఏలు), ముఖ్యంగా ఎఎల్ఎలు, ఉంటాయి కాబట్టి అవిసె గింజలు ఆరోగ్యదాయకమైన అనుబంధాహారంగా ప్రాచుర్యం పొందాయి.. ఎఎల్ఎ, లిగ్నాన్లు పుష్కలంగా ఉండటం మూలంగా అవిసె గింజలు గుండెకు మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలను, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి.మెనోసాజ్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్దకం, మానసిక అలసటను తగ్గిస్తాయి. అవిసె గింజల పిండిని అనేక అనారోగ్యాలను తగ్గించడానికి అనాదిగా వాడుతున్నారు. అయితే, శ్యానోజెనిక్ గ్లైకోసైడ్స్, ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్, ఫైటిక్ ఆసిడ్ వంటి యాంటీ న్యూట్రియంట్లు ఉన్నప్పటికీ.. మొత్తంగా చూస్తే అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నెరవేరతాయి. అంతేకాదు ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా దోహపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. గాయాలను త్వరగా మానేలా చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి దోహదపడతాయి.అవిసె గింజలను ఎలా ఉపయోగించాలి:అవిసె గింజలను పొడిగా చేసి, సూప్ లు, సలాడ్ లు, పెరుగు లేదా స్మూతీలలో కలుపుకోవచ్చు.అవిసె గింజల నూనెను కూడా ఉపయోగించవచ్చు.అవిసె గింజలను నానబెట్టి, రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం తినవచ్చు. లైట్‌గా వేయించి, తేనె లేదా వెచ్చని నీటితో కూడా తీసుకోవచ్చు.అవిసె గింజలను పచ్చిగా తినడం అంత మంచిది కాదు, ఎందుకంటే వాటిలోని పోషకాలు సరిగా జీర్ణం కావు. రోజుకు ఒకటి నుండి రెండు చెంచాల అవిసె గింజల పొడి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని వినియోగించేందుకు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం -
సూపర్ ఫుడ్ అవిసె గింజల్లోని పోషకాల గురించి తెలుసా?
అవిసె గింజలను సూపర్ ఫుడ్‌గా, ఫంక్షనల్ ఫుడ్‌గా చెబుతారు. అంటే.. ఈ గింజలు పోషకాహారంగా మాత్రమే కాకుండా ఔషధ గుణాలు కలిగి ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయన్న మాట. సాధారణ ధాన్యాలు కేవలం ఆకలిని తీర్చటానికే పరిమితమవుతాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ పశ్చిమబెంగాల్ బారక్‌పూర్‌లోని కేంద్రీయ జనపనార, ఇతర నార ఉత్పత్తుల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్) శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం అవిసె గింజల్లో పోషక, ఔషధ విలువలు ఇలా ఉన్నాయి: అవిసె గింజల్లో 35–43% కొవ్వు ఆమ్లాలు, 18–21% మాంసకృత్తులు, 25–28% డయటరీ ఫైబర్, 1–2% పిండిపదార్థాలు ఉంటాయి. ఒమెగా 3 కొవ్వు ఆమ్లం, ఎఎల్ఎ, లినోలీక్ ఆమ్లం(ఎల్ఎ), ఎసెన్షియల్ విటమిన్లు, అమినో ఆమ్లాలు, స్థూల–సూక్ష్మ మూలకాలు, లిగ్నాన్లు, ఫ్లావనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అత్యధిక మొత్తంలో పాఅన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు (పీయూఎఫ్ఏలు), ముఖ్యంగా ఎఎల్ఎలు, ఉంటాయి కాబట్టి అవిసె గింజలు ఆరోగ్యదాయకమైన అనుబంధాహారంగా ప్రాచుర్యం ΄పొందాయి.. ఎఎల్ఎ, లిగ్నాన్లు పుష్కలంగా ఉండటం మూలంగా అవిసె గింజలు గుండెకు మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలను, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. అవిసె గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు కేన్సర్‌ను నిరోధిస్తాయి.మెనోసాజ్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్దకం, మానసిక అలసటను తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. గాయాలను త్వరగా మానేలా చేస్తాయి. అవిసె గింజల పిండిని అనేక అనారోగ్యాలను తగ్గించడానికి అనాదిగా వాడుతున్నారు. అయితే, శ్యానోజెనిక్ గ్లైకోసైడ్స్, ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్, ఫైటిక్ ఆసిడ్ వంటి యాంటీ న్యూట్రియంట్లు ఉన్నప్పటికీ.. మొత్తంగా చూస్తే అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నెరవేరతాయి. అందువల్లనే అవిసె గింజలు ఔషధగుణాలున్న పోషక గింజలుగా ప్రసిద్ధి పొందుతున్నాయి.అవిసె నార ఉత్పత్తి కన్నా అవిసె గింజల ఉత్పత్తికి మన దేశ వాతావరణం అనుకూలమైనదని ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరప్ దేశాల నుంచి అవిసె గింజలను దిగుమతి చేసుకోవటం వల్ల విదేశీ మారకద్రవ్యాన్ని మన దేశం నష్ట΄ోతోంది. ఓఈసీ గణాంకాల ప్రకారం భారత్ ఫ్లాక్స్ ఫైబర్ దిగుమతులు 2016లో 3.15 కోట్ల డాలర్ల నుంచి 2021 నాటికి 9.45 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఫ్లాక్స్ ఫైబర్‌ను మనం పండిస్తున్న దానికీ, మన అవసరాలకు పెద్ద అగాధం ఉంది. అంటే, ఫ్లాక్స్ ఫైబర్ సాగును దేశీయంగా పెంచుకోవటానికి గల అవకాశాలను ఇది సూచిస్తోంది. అయితే, గింజల కోసం ఒక పంట, నార కోసం మరో పంట కాకుండా.. రెండిటి కోసమూ ఒకే పంటను పండించుకుంటే ఈ కొరతను తీర్చుకోవటం వీలవుతుంది. భారతీయ పరిస్థితులకు తగిన మేలైన నార అవిసె రకాలను అభివృద్ధి చేసుకోవటం ద్వారా ఫ్లాక్స్ ఫైబర్ ఉత్పత్తిలో మనం స్వయంసమృద్ధి సాధించవచ్చు. ఈ సవాలును అధిగమించేందుకు అనువైన వంగడాలను 2015లోనే జెఆర్ఎఫ్–2 (తైర)ను ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. సాగు పెంచాలంటే చెయ్యాల్సిన మరో పని ఏమిటంటే.. మన దేశంలో వేడిగా, తేమగా ఉండే వాతావరణాల్లో చక్కగా పెరిగే అవిసె నార పంట సాగుకు అనువైన వంగడాలను రూ పొందించుకోవటం ముఖ్యం. రైతులు తొలిగా సాగు చేసిన పంటల్లో ఒకటైన అవిసెకు ఆరోగ్య ప్రయోజనాలు చాలా మెండుగా ఉన్నాయి. ఈ గింజలతో వంట నూనె తయారు చేసుకోవచ్చు. ఔషధ గుణాలతో కూడిన ఆహారోత్పత్తులు చేసుకోవచ్చు. గానుగ పిండి పశుదాణాగా పనికొస్తుంది. కాండం పీచుతో వస్త్రాలను తయారు చేసుకోవచ్చు. ప్రపంచ అవిసె ఉత్పత్తి గతంలో కన్నా క్షీణించినప్పటికీ.. దీని సహజ ఆరోగ్యకర ఉత్పత్తుల ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై పెరిగిన అవగాహన వంటి కారణాల రీత్యా అవిసె పంట తిరిగి పుంజుకోవడానికి అవకాశాలున్నాయి. ఉన్నతమైన అవిసె వంగడాలను అభివృద్ధి చేయడానికి అధునాతన బయోటెక్నాలజీ పద్ధతులను శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో అవిసె ‘అద్భుత పంట’గా తన ఖ్యాతిని మరింత మిన్నగా కొనసాగిస్తుందని ఆశిద్దాం.అబ్జర్వేటరీ ఆఫ్ ఎకనామిక్ కాంప్లెక్సిటీ 2021 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 134 కోట్ల డాలర్ల లిన్సీడ్ వాణిజ్యం జరిగింది. రష్యా, కెనడా, కజకిస్తాన్ ఎగుమతిలో ముందంజలో ఉన్నాయి. బెల్జియం, చైనా, అమెరికా ఎక్కువగా దిగుమతి చేసుకున్నాయి. 2021లో మన దేశం 1.35 కోట్ల డాలర్ల అవిసె గింజలను ఎగుమతి చేసింది. ప్రపంచ మార్కెట్లో ఇది 1%. అదే సంవత్సరం 1.53 లక్షల డాలర్ల విలువైన అవిసె గింజలను విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. 2021లో 98.5 కోట్ల డాలర్ల ముడి అవిసె నార వాణిజ్యం జరిగింది. ఫ్రాన్స్, బెల్జియం, అమెరికా, బెలారస్ ఎక్కువగా ఎగుమతి చేశాయి. చైనా, బెల్జియం, భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకున్నాయి. చదవండి: లోకార్బ్ హై/హెల్దీ ఫ్యాట్ : అవిసె గింజలు అద్భుతఃఅవిసె నార ఉత్పత్తి కన్నా అవిసె గింజల ఉత్పత్తికి మన దేశ వాతావరణం అనుకూలమైనదని ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరప్ దేశాల నుంచి అవిసె గింజలను దిగుమతి చేసుకోవటం వల్ల విదేశీ మారకద్రవ్యాన్ని మన దేశం నష్ట΄ోతోంది. ఓఈసీ గణాంకాల ప్రకారం భారత్ ఫ్లాక్స్ ఫైబర్ దిగుమతులు 2016లో 3.15 కోట్ల డాలర్ల నుంచి 2021 నాటికి 9.45 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఫ్లాక్స్ ఫైబర్‌ను మనం పండిస్తున్న దానికీ, మన అవసరాలకు పెద్ద అగాధం ఉంది. అంటే, ఫ్లాక్స్ ఫైబర్ సాగును దేశీయంగా పెంచుకోవటానికి గల అవకాశాలను ఇది సూచిస్తోంది. అయితే, గింజల కోసం ఒక పంట, నార కోసం మరో పంట కాకుండా.. రెండిటి కోసమూ ఒకే పంటను పండించుకుంటే ఈ కొరతను తీర్చుకోవటం వీలవుతుంది. భారతీయ పరిస్థితులకు తగిన మేలైన నార అవిసె రకాలను అభివృద్ధి చేసుకోవటం ద్వారా ఫ్లాక్స్ ఫైబర్ ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించవచ్చు. ఈ సవాలును అధిగమించేందుకు అనువైన వంగడాలను 2015లోనే జెఆర్ఎఫ్–2 (తైర)ను ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. సాగు పెంచాలంటే చెయ్యాల్సిన మరో పని ఏమిటంటే.. మన దేశంలో వేడిగా, తేమగా ఉండే వాతావరణాల్లో చక్కగా పెరిగే అవిసె నార పంట సాగుకు అనువైన వంగడాలను రూపొందించుకోవటం ముఖ్యం. ఇదీ చదవండి: ప్రియుడు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కానీ..రేర్ కేన్సర్ కబళించింది!నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షిసాగుబడి డెస్క్ -
లోకార్బ్ హై/హెల్దీ ఫ్యాట్ : అవిసె గింజలు అద్భుతః
అద్భుత పంట అవిసె పంట. అవిసె గింజలను ఆంగ్లంలో ‘ఫ్లాక్స్ సీడ్స్’ అంటారు. వంట నూనె వాణిజ్య వర్గాల్లో అవిసె నూనెకు ‘లిన్ సీడ్ ఆయిల్’ అని పేరు. ఈ నూనె చాలా ఆరోగ్యదాయకం. అవిసె మొక్క కాండం నుంచి తీసే నార/పీచు (లినెన్)తో తయారైన మెత్తని వస్త్రాలకు మధ్యతరగతి, ఉన్నత వర్గాల మార్కెట్లలో దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. వీటన్నిటికీ మించి.. అవిసె గింజలు పోషకాల పుట్టలు. ఈ గింజల పిండితో చేసిన రొట్టెలు, ఇతర వంటకాలు అద్భుతపోషక విలువలతో కూడి ఉండి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ముఖ్యంగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకునే ‘లోకార్బ్ హై/హెల్దీ ఫ్యాట్’ ఆహార పద్ధతిని పాటించే వారికి గోధుమలు, చిరుధాన్యాలకు అవిసె గింజల రొట్టె అద్భుత ప్రత్యామ్నాయం!.. అవిసె పంట కొత్తదేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా అనాదిగా ఉన్నదే. అంతేకాక, ఎంతో ఆరోగ్యదాయకమైన వర్షాధార పంటే అయినా, మన ప్రజల్లో చాలా మందికి దీని గురించి అంతగా తెలియకపోవటం ఆశ్చర్యకరం!అవిసె.. ఈ పేరుతో రెండు పంటలు ఉన్నాయి. మొదటిది: సన్నగా, పొడవుగా, గోగు మొక్క మాదిరిగా పది అడుగులు పెరిగే రకం ఒకటి. దీని శాస్త్రీయ నామం ‘సెస్బానియా గ్రాండిఫ్లోరా’. ఇది తమలపాకు తోటల్లో కనిపిస్తుంది. తమలపాకు తీగలను ఈ మొక్కలకే పాకిస్తారు. ఈ చెట్టు ఎర్ర /తెల్ల పూలు, కాయలు ఔషధ గుణాలున్న తినదగినవి. చదవండి: సెలవంటే పండగ..ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బూ ఆదా ఇలా!రెండోది: ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రకం. దీని శాస్త్రీయ నామం ‘లినమ్ యుసిటాటిస్సిమం’. ఇది చిన్న పొద వంటి మొక్క. దీని కాయలు ధనియాల మాదిరిగా చిన్నగా ఉంటాయి. దాన్ని చిదిపితే లోపల కాఫీ రంగులో సన్నని, చిన్న గింజలు ఉంటాయి. అవే అవిసె గింజలు. మంచి పోషక విలువలున్నవి. ఇది నూనె గింజ పంటగా ప్రసిద్ధి. అవిసెను మానవ సంక్షేమం కోసం సహజ ఉత్పత్తులనిచ్చే విలువైన ఆర్థిక పంటగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. వాణిజ్యపరంగా ముఖ్యమైన నార/ఫైబర్, నూనెను ఉత్పత్తి చేసే మొక్కల జాతికి చెందినది. అవిసె సాగుకు సుదీర్గ చరిత్ర ఉంది. వివిధ పురాతన నాగరికతల పత్రాలను పరిశీలిస్దే ఇది అర్థమవుతోంది. అవిసె సాగు కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లినోలెనిక్ ఆమ్లం, లిగ్నాన్లు సహా బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా కలిగి ఉన్నందున అవిసె గింజలు, అవిసె నూనె గుర్తింపు పొందాయి. అవిసె నార వస్త్ర పరిశ్రమలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో గుర్తింపు ఉన్న అవిసె పంటపై పరిశోధనలు ఇటీవల ఊపందుకున్నాయి. మాలిక్యులర్ జెనెటిక్స్, బ్రీడింగ్, జెనోమిక్స్, జీనోమ్ ఎడిటింగ్ సహా అత్యాధునిక జన్యు ఇంజనీరింగ్ పద్ధతులలో పరిశోధనలు విస్తృతం అవుతున్నాయి. పరిశోధనలో పురోగతి, అవిసె సహజ ఉత్పత్తుల ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన రైతుల ఆర్ధికాభివృద్ధికి, దేశ ఆర్థికాభివృద్ధికి కూడా దోహద పడవచ్చని నిపుణుల అంచనా. పది వేల ఏళ్ల క్రితం మానవులు స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యవసాయం మొదలు పెట్టిన అవిసెను వేలాది ఏళ్ల క్రితమే ఆహార (నూనె గింజ) పంటగా, పశుగ్రాస పంటగా, నార పంటగా సాగు చేయటం ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. నార కోసం పొడుగు పంట, నూనెగింజల కోసం పొట్టి రకం అవిసె పంటలు అప్పటి నుంచే ఉన్నాయి. అధిక నాణ్యతతో కూడిన వస్త్రాల నేతకు పనికొచ్చే అవెసె నార 5,700 ఏళ్ల క్రితం నుంచే వాడుకలో ఉంది. సింథటిక్ వస్త్రాల ఉత్పత్తి పెరిగినప్పటి నుంచి లినిన్ వాడకం మందగించింది. అయితే, పర్యావరణహితమైన సుస్థిర సహజ ఉత్పత్తిగా లినెన్ వస్త్రాలకు ఆదరణ ఇటీవల కాలంలో పెరుగుతోంది. వస్త్రోత్పత్తితో పాటు ఫ్లాక్స్ ఫైబర్‌ను ఇన్సులేషన్, కం΄ోజిట్స్, కరెన్సీ వంటి స్పెషాలిటీ పేపరు, జియో టెక్స్‌టైల్స్‌లోనూ వాడుతున్నారు. దీంతో ఈ పంటను తిరిగి విస్తృతంగా చేపట్టడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ ఇటు వంట నూనెగా అటు పారిశ్రామిక ప్రయోజనాలున్న నూనెగా ప్రసిద్ధి పొందింది. లిన్సీడ్ ఆయిల్, ఫ్లాక్స్సీడ్స్లో ఆరోగ్యాన్ని పెంపొందించే లినోలెనిక్ ఆసిడ్ (ఎఎల్ఎ), ప్రొటీన్, డైటరీ ఫైబర్‌తో పాటు పాలీఅన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ (పీయూఎఫ్ఏలు) పుష్కలంగా ఉన్నాయి. లిన్సీడ్ ఆయిల్‌కు త్వరగా తడారిపోయే స్వభావం ఉండటంతో రంగులు, ప్రింటర్స్ ఇంక్, వార్నీషులు, లైనోలియం, సబ్బులు వంటి పారిశ్రామిక ఉత్పత్తుల్లోనూ వాడుతున్నారు. ఫ్లాక్స్సీడ్స్కు పోషకవంతమైన పెంపుడు పక్షుల ఆహారంగా పేరుంది. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే.. అవిసె ఉత్పత్తులకు ఆరోగ్య దాయకమైన, పర్యావరణహితమైన వైవిధ్యభరితమైన ప్రయోజనాలు ఉన్నాయి.అడవి జాతి అవిసె పుట్టింది ఎక్కడో స్పష్టంగా తెలియదు. అయితే, మెడిటెర్రేనియన్, ఆగ్నేయాసియాల మధ్య ప్రాంతంలో పుట్టింది. తొలుత ఈజిప్టు, పాలస్తీనా, ఇజ్రాయెల్, సిరియా, తుర్కియే, జోర్దాన్ ప్రాంతంలో సాగైంది. తదనంతరం క్రమంగా ప్రపంచవ్యాప్తమైంది. తుర్కియేలో క్రీస్తు పూర్వం 6 వేల ఏళ్ల నాటి పురావస్తు అవశేషాల్లో అవిసె నార కనిపించింది. లినిన్/లైనిన్ వస్త్రంగా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తున్న ఫైబరే పత్తి కన్నా అతి ప్రాచీన పంటని పరిశోధకులు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం 5 వేల ఏళ్ల క్రితం ఈజిప్టులో వస్త్రాలు, వస్తువులు, మమ్మీలకు చుట్టిన బ్యాండేజ్‌లలో అవెసె నార వాడారు. తదనంతర కాలంలో స్కాటాండ్, పర్షియా, భారత్, చైనా తదితర దేశాల్లో వర్తకులు అవెసె వస్త్రాలు, ఇతర ఉత్పత్తుల్ని విక్రయించారు. జర్మనీ, రష్యాల నుంచి ముడి అవిసె నారను తెప్పించి ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లండ్లలో లైనెన్ వస్త్ర పరిశ్రమలు వస్త్రాలు తయారు చేశాయి. ‘స్వచ్ఛత’కు ప్రతీకగా ఈజిప్షియన్, క్రిస్టియన్ తదితర నాగరికతల్లో దేవుళ్లు, దేవతలు అవిసె వస్త్రాలను వేసుకున్నారట. అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా లైనెన్ వస్త్రాలను వేసుకున్నారట. మధ్యయుగంలో ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియంలలో ఇంటింటికీ అవిసె వస్త్రాలు, దుప్పట్లు ఎవరికి వారు నేసుకునేవారట. ఫ్లాక్స్ స్పిన్నింగ్ యంత్రం కనుగొనటంతో దీని సాగు తామరతంపరగా విస్తరించింది. అయితే తదనంతర కాలంలో పత్తి పంట అందుబాటులోకి వచ్చాక దీని ప్రాభవం తగ్గిపోయింది. ఏతావాతా చెప్పేదేమంటే.. అవిసె పంటకు అనాదిగా ఘన కీర్తి ఉంది.ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎవో) 2021 నాటి గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 41.4 లక్షల హెక్టారలో 33.4 లక్షల టన్నుల అవిసె గింజలు పండుతున్నాయి. 2017–21 మధ్యకాలంలో సాగు విస్తీర్ణం ఆసియాలో 45.7%, యూరప్‌లో 30.4%, అమెరికాలో 20.2% విస్తరించి ఉంది. కజికిస్తాన్, రష్యా, కెనడా, చైనా, భారత్, అమెరికా, ఇథియోపియా, ఫ్రాన్స్, యూకేలలో లిన్సీడ్స్ సాగు విస్తారంగా జరుగుతోంది. అదేవిధంగా, ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల హెక్టార్లలో 8 మెట్రిక్ టన్నుల ఫ్లాక్స్ ఫైబర్ దిగుబడి వస్తోంది. అవిసె నారను 96.6% మేరకు యూరోపియన్ దేశాల్లోనే ఉంది. ఫ్రాన్స్, బెల్జియం, బెలారస్, రష్యా, యూకేలలో ఎక్కువ. ఆసియాలో అవిసె నార సాగు కేవలం 2% మాత్రమే. ఇందులో చైనాదే సింహభాగం. భారత్‌లో అవిసె నార సాగు బాగా తక్కువ. అవిసె గింజల ఉత్పత్తి గత ఐదేళ్లలో సగటున ఏటా 2.4 లక్షల హెక్టార్లలో 1.4 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు జరిగింది. అయితే, 1961–65 నాటితో (19.4 లక్షల హెక్టార్లలో 4.3 లక్షల టన్నుల ఉత్పత్తితో) పోల్చితే ఇది బాగా తక్కువ. అవిసె పంట 10–25 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతల మధ్య, 155–200 ఎం.ఎం. వార్షిక వర్షపాతం, 60–65% గాలిలో తేమ ఉన్న చోట్ల బాగా పెరుగుతుంది. మన దేశంలో అక్టోబర్ చివరి నుంచి నవంబర్ మధ్య వరకు సీతాకాలపు పంటగా ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో సాగు చేస్తారు. నీరు నిలవని ఒండ్రు నేలల్లో, 5.5–6 పిహెచ్ ఉండే నేలల్లో పెరుగుతుంది. (ఎ) పూత దశలో ఉన్న అవిసె మొక్క(బి) అవిసె వంగడాల్లో వివిధ పూల రంగుల వైవిధ్యం(సి–డి) పరిపక్వ దశలో అవిసె కాయలు, విత్తనాలు(ఇ) కాండం నుంచి సేకరించిన అవిసె ఫైబర్ (లినెన్ నార) నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
కర్బూజా– కాజు, అవిసె గింజలతో హెల్తీ స్నాక్స్ చేసుకోండిలా..!
కర్బూజా– కాజు స్వీట్కావలసినవి: కర్బూజా– 1 (తొక్కలు, గింజలు తీసి, ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలను మిక్సీలో వేసుకుని, మెత్తగా గుజ్జులా చేసుకోవాలి)పంచదార– సరిపడాజీడిపప్పు గుజ్జు– పావు కప్పుకొబ్బరి కోరు– పావు కప్పు పైనే (గార్నిష్‌కి కూడా వాడుకోవచ్చు)తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, ఒక కళాయిలో కర్బూజా గుజ్జు వేసుకుని, చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. ఒక నిమిషం తర్వాత పంచదార వేసుకుని దగ్గరపడే వరకు తిప్పుతూ ఉండాలి.అనంతరం జీడిపప్పు గుజ్జు, పావు కప్పు కొబ్బరి కోరు వేసుకుని తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని, చల్లారనివ్వాలి. ఆ తర్వాత నచ్చిన విధంగా ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న స్వీట్స్‌లా చేసుకుని, కొద్దికొద్దిగా కొబ్బరికోరుతో అందంగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.అవిసె గింజల నేతి లడ్డూ..కావలసినవి: అవిసె గింజలు– 1 కప్పు, జీడిపప్పు, నువ్వులు– 1 టేబుల్ స్పూన్ చొప్పున (నేతిలో వేయించి పౌడర్లా చేసుకోవాలి), వేరుశనగలు– అర కప్పు (దోరగా వేయించి, మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి), బెల్లం కోరు– అర కప్పు, బాదం గింజలు–10 (దోరగా వేయించి పొడి చేసుకోవాలి), నెయ్యి– సరిపడా, ఏలకుల పొడి– కొద్దిగాతయారీ విధానం: ముందుగా అవిసె గింజలను దోరగా వేయించి, చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం అందులో బాదం పొడి, ఏలకుల పొడి, జీడిపప్పు మిశ్రమం వేసుకుని నెయ్యి పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. అప్పుడు ఆ ముద్దను, చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిపై జీడిపప్పు లేదా బాదం ముక్కలను ఒత్తుకుని.. సర్వ్ చేసుకోవచ్చు.(చదవండి: తాత మొండి పట్టుదల ఎంత పనిచేసింది..! ఏకంగా ఇంటి చుట్టూ..) -
భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!
శీతాకాలం ప్రారంభం కాగానే కొన్ని రకాల శ్వాసకోస వ్యాధులు, కీళ్లు, మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. అందుకే ఈ సీజన్లో రుచితో పాటు,ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి ఒక గొప్ప సూపర్ ఫుడ్ అవిశె, నువ్వుల లడ్డు. పోషకాలతోపాటు అనేక రకాలుగా మనకు లాభాలను చేకూర్చే అవిశె గింజలు, నువ్వుల లడ్డూ(Flax Seeds And Sesame Seeds Laddu) ఎలా తయారు చేయాలో చూద్దాం.ఈ లడ్డూలు తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయో, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయి. అంతేకాకుండా, వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. నువ్వులలో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, భాస్వరం, జింక్, మాలిబ్డినం, సెలీనియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. ఇక అవిశె గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులకు అద్భుతమైన మూలం. పోషకాలకు శక్తివంతమైనది కూడా. వీటి ద్వారా విటమిన్ బి, సి, డైటరీ ఫైబర్, సోడియం, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ , ఫోలేట్ వంటి విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. బెల్లంతో మంచి ఐరన్ లభిస్తుంది. అంతటి శ్రేష్టమైన వీటికి దేశీ నెయ్యి , సేంద్రీయ బెల్లంతో కలిసి లడ్డూలను తయారు చేసుకుంటే అది సూపర్ ఫుడ్ కాక ఏమవుతుంది.అవిశె గింజలు - నువ్వుల లడ్డు తయారీకావాల్సిన పదార్థాలునువ్వులు, అవిశెగింజలు, బెల్లం, కొద్దిగా బాదం, జీడింపప్పులు, బెల్లం, కొద్దిగా నెయ్యి, చిటికెడు యాలకుల పొడిముందుగా రెండు కప్పుల అవిశె గింజలు( Flax Seeds) దోరగా వేయించిన, అలాగే ఒక కప్పు నువ్వులను కూడా దోరంగా వేయించుకోవాలి. దీంతోపాటు బాదం, జీడి పప్పులను కూడా నూనె లేదా నెయ్యి లేకుండానే వేయించుకోవాలి. ఇవి గోరు వెచ్చగా ఉండగానే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ,రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి (Ghee) ఒకటిన్నర కప్పు ఆర్గానిక్ బెల్లం తురుము వేసి పాకం పట్టుకోవాలి. పాకం వచ్చినాక, ముందుగా పొడి చేసిపెట్టుకున్న అవిశె, నువ్వుల పొడిని వేసుకుంటూ బాగా కలపాలి. కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇందులో చిటికెడ్ యాలకుల పొడి, బాదం, జీడిపప్పుల పొడి వేసుకోవాలి. కొద్దిసేపాక దింపేసుకుని కొంచెం వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. ఈ లడ్డూ వలన ఎముకలు బలోపేతమవుతాయి. ఇదీ చదవండి: వింటర్ కేర్ : పాదాల పగుళ్లకు స్ప్రేఅవిశె గింజలు - నువ్వుల లడ్డు లాభాలుశీతాకాలంలో చలి నుండి రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.బరువు నిర్వహణలో సహాయపడుతుంది. బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా రెండు విషయాల్లోనూ ప్రయోజనకరంగా ఉంటుంది.క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అధిక రక్తపోటును తగ్గించడంలో, శరీరంలో సాధారణ బీపీ నిర్వహణలో సహాయపడుతుంది.కడుపుకు చాలా ప్రయోజనకరం. డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . జీవక్రియను కూడా పెంచుతుంది.ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ,మంచి కొలెస్ట్రాల్ ( HDL)ను పెంచడంలో సహాయపడుతుంది.రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.ఎముకలు ,కండరాలను బలపరుస్తుంది.మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది .నిద్ర సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది.అలసటను తొలగించి శరీరాన్ని శక్తివంతం చేస్తుంది.అనేక చర్మ, జుట్టు సమస్యలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇంకా మోకాళ్లు , కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని మోకాళ్ళ నొప్పులు(Knee Pain) వేధిస్తున్నాయి. అలాంటి వారికి ఇది చాలా మేలు చేస్తుంది.(37 కిలోలు తగ్గి, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన గృహిణి)నోట్: వయసుతోపాటు వచ్చే మోకాళ్ల నొప్పులకు జీవన శైలిమార్పులు, కండరాలను బలోపేతం చేసే కొన్ని రకాల వ్యాయామాలు తప్పనిసరి. దీంతోపాటు వైద్యుల సలహా ప్రకారం అవసరమైతే కొన్ని మందులను వాడాల్సి ఉంటుంది. -
Beauty: అందుకే అవాంఛిత రోమాలు! ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా ఉండేవి తింటే..
ప్రస్తుతకాలంలో అవాంఛిత రోమాలతో చాలామంది బాధపడుతున్నారు. అది అందమైన ముఖాన్ని అంద విహీనంగా చేస్తుంది. వాటిని చూసుకున్నప్పుడల్లా స్త్రీలు ఎంతో బాధని అనుభవిస్తుంటారు. సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖంపై అవాంఛిత రోమాలు పెరుగుతుంటాయి. ఏది ఏమైనా అవాంఛిత రోమాలు అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. దీనికి వాక్సింగ్, షేవింగ్, ఇతర చికిత్సలు చేయించటం వల్ల క్రమంగా మరింత పెరుగుతాయి. దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమి లేదు, కానీ కొన్ని సహజ నివారణలు ఉన్నాయి. అవేంటో చూద్దాం... పసుపు ►ఇది మనం ప్రతి రోజు మన వంటల్లో వాడేదే.. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు అవాంఛిత రోమాలును తొలగించి ముఖంలో తేజస్సుని, అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ►దీన్ని ఆయుర్వేదంలో ఒక ఔషధంలా ఉపయోగిస్తారు. ►పసుపుని శెనగపిండితో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ►పసుపు రోమాలను తొలగించటమే కాకుండా వాటి పెరుగుదలను కూడా అదుపులో ఉంచుతుంది. ఇవి కూడా! ►వీటితోపాటుగా ఆరోగ్యకరమైన ఆహారం కూడా ముఖ రోమాలు వదిలించుకోవటంలో సహాయపడుతుంది. ►సరియైన ఆహారం తీసుకోకపోవడం వలన ఇది అధికమయ్యే ప్రమాదముంది. ►ముఖంపై అవాంఛిత రోమాల బెడద తగ్గాలంటే ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ►ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా అవిసెగింజలు, సోంపు, అల్ఫాల్ఫాలో ఉంటాయి. చదవండి: Heart Attack: బయట ఫ్రైడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు తరచుగా తింటున్నారా? అయితే.. Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్ తీసుకుంటే!
బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, భుజాలు, కీళ్ల నొప్పులు... ఇలా అనేక రకాలుగా ఎముకల బలహీనత వల్ల శరీరంలో నొప్పులు బాధిస్తుంటాయి. కాల్షియం లోపం ఇందుకు ప్రధాన కారణం. ఎముకల నొప్పులు తగ్గాలంటే మంచి ఉపాయం ఒకటుంది. మూడురకాల గింజల పొడుల మిశ్రమం ఎముకల పటిష్టతకు తోడ్పడి నొప్పులు శాశ్వతంగా దూరం అవుతాయి. ఈ మూడురకాల గింజలు తేలిగ్గా మార్కెట్లో దొరికేవే. ఒకసారి ప్రయత్నించి చూడండి. అవిశె గింజలు, సబ్జాగింజలు, గుమ్మడి గింజలు.. ఈ మూడు రకాల గింజల వినియోగం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది. అవిశ గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) ఫ్లాక్స్ సీడ్స్ ఒమెగా 3 పోషకాల గని. కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఒమెగా 3 శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అలాగే వీటిల్లో ఉంటే కాల్షియం ఎముకలను పటిష్టం చేస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ అధిక ఆకలిని తగ్గించి శరీర బరువును అదుపులో ఉంచుతుంది. సబ్జా గింజలు (చియా సీడ్స్) సబ్జా గింజలు లేదా చియా సీడ్స్‌లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం ఎముకలు పటిష్టంగా ఉండేలా తోడ్పాటు అందిస్తాయి. ఇందులో కూడా ఒమెగా 3 ఉంటుంది. అలాగే చియా సీడ్స్ యాంటీ ఆక్సిడంట్స్‌గా పనిచేస్తాయి. గుమ్మడి గింజలు (పంప్కిన్ సీడ్స్) ఇందులో ప్రొటీన్, ఫైబర్, ఒమెగా 3, మెగ్నీషియం, జింక్ పోషకాలు ఉంటాయి. బాగా శక్తినివ్వడంతో పాటు మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎలా తయారు చేయాలి? అవిశ గింజలు, చియా సీడ్స్, గుమ్మడి గింజలను సమపాళ్లలో తీసుకుని వేర్వేరుగా వేయించుకోవాలి ఉదాహరణకు ఒకరకం గింజలను 100 గ్రాములు తీసుకుంటే మిగిలిన వాటిని కూడా వంద వంద గ్రాములే తీసుకోవాలి. దోరగా వేగిన తరువాత చల్లార్చి మిక్సీలో వేర్వేరుగా పొడి చేసుకోవాలి. మిక్సీ వేయడం పూర్తయ్యాక మూడు పొడులను కలిపేసుకుని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. రోజూ ఈ మిశ్రమం నుంచి టీ స్పూన్ పొడిని మజ్జిగలో కలుపుకొని తాగాలి లేదా అన్నంలోనైనా కలుపుకొని తినొచ్చు. ఇలా కొద్దిరోజులు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మీ ఎముకల నొప్పులు, నడుము నొప్పి మాయం అవడమే కాకుండా.. మళ్లీ నొప్పులు రావు. చదవండి: Amarnath Vasireddy: కూర్చోవడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే! అన్నం ఎక్కువ తిన్నారో! -
Health Tips: రొట్టె, తృణధాన్యాలు.. చేపలు, అవిసె గింజలు.. తరచుగా తింటే!
‘నిండు నూరేళ్లు చల్లగా ఉండు’ అని పెద్దలు దీవిస్తుంటారు... అయితే అలా నూరేళ్లు కాకపోయినా జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉండడం, సరాసరి జీవితకాలం కన్నా ఎక్కువ కాలం జీవించగలగడం మన చేతిలోనే ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 20 ఏళ్ల వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఆరంభిస్తే కనీసం పది నుంచి పదమూడేళ్లు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారని ఒక పరిశోధనలో తెలిసింది. అయితే దేనిని ఆరోగ్యకరమైన ఆహారం అంటారో తెలుసుకుందాం. ఇది చదివి ‘అయ్యో! మనం చిన్నప్పటినుంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని ఉంటే బాగుండేది, ఇప్పుడు ఏమి ప్రయోజనం! అని బాధపడనక్కరలేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మంచి ఆహారం తీసుకోవడం కనీసం ఇప్పటినుంచి ప్రారంభించినా మరికొంతకాలంపాటు మన ఆయుర్దాయాన్ని పొడిగించుకున్నట్లేనని అధ్యయనాలు చెబుతున్నాయి. రెడ్‌మీట్ అతిగా వద్దు ప్రాసెస్ చేసిన ఆహారం, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునే వారికంటే పండ్లు, కూరగాయలు, తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని, రెడ్ మీట్‌ను తక్కువగా తీసుకునే వాళ్లు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారని కొన్ని సర్వేలలో తేలింది. అందుకే బరువు పెరుగుతారు ఆరోగ్యకరమైన ఆహారం చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది. మీరు చేసే పనిపై మీరు తీసుకునే ఆహారం ఆధారపడి ఉంటుంది. మానసిక శ్రమ చేసేవారికంటే శారీరక శ్రమ చేసే వారు ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే, వారి శరీర అవసరాలకు మించి తినడం, తాగడం చేస్తే బరువు పెరుగుతారు. తీసుకునే అధిక కేలరీలు కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. అది చాలా హానికరం. అందువల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందేలా చూసుకోవాలి. పురుషులకు రోజుకు 2,500 కేలరీలు, మహిళలకు రోజుకు సుమారు 2,000 కేలరీలు అవసరమవుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. రొట్టె, బియ్యం.. ఆహారంలో మూడింట ఒక వంతు మాత్రమే కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు) ఉండాలి. ఇవి అధికంగా ఉండే బంగాళాదుంపలు, రొట్టె, బియ్యం, తృణధాన్యాలు. పగలు చేసే భోజనంలో కనీసం పై వాటిలో ఒక పదార్థం ఉండేలా చూసుకోవాలి. కొంతమంది పిండి పదార్థాలను కొవ్వుగా భావిస్తారు, కాని తక్కువ మోతాదులో తీసుకున్న కార్బోహైడ్రేట్ సగం కంటే తక్కువ కేలరీలను అందిస్తుంది. జ్యూస్‌లు తాగాలి ప్రతిరోజూ ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అల్పాహారంలో అరటిపండును ఎంచుకోవచ్చు. ఏదైనా పండును జ్యూస్ రూపంలో తీసుకుంటే అది మితంగానే ఉండేలా చూసుకోవాలి. చేపలు తరచుగా తింటే.. మరి శాకాహారులైతే చేప ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను అధికంగా కలిగి ఉంటుంది. వారానికి కనీసం రెండుసార్లు చేపలను తినడం మంచిది. చేపలలో ఉండే ఒమేగా –3 కొవ్వులు గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. శాకాహారులైతే వాటికి ప్రత్యామ్నాయంగా అవిసె గింజలు, మినుములు, నువ్వులతో తయారు చేసిన పదార్థాలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు, చక్కెరలు, నెయ్యి వాడకాన్ని తగ్గించాలి. మాంసాహార వంటల్లో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్‌లో అధికంగా చక్కెరలు ఉంటాయి. ఇది ఊబకాయానికి, దంత సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. అలాగే, నిల్వ ఉండే చిప్స్ వంటి చిరుతిళ్లలో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. చదవండి: Almonds Benefits: బాదాం ఎలా తింటే మంచిది? పోషకాలు పుష్కలంగా లభించాలంటే? -
Benefits Of Flax Seeds: అనేక సమస్యలకు అవిసె గింజలతో చెక్
-
Flax Seeds: కాయగూరలు, చేపలతోపాటు అవిసె గింజలు కలిపి తింటే..
Flax Seeds Amazing Health Benefits How To Consume: అవిసె గింజలను ఆంగ్లంలో ఫ్లేక్స్ సీడ్స్ అంటారు. తెలుగులో అవిసె గింజలు, ఉలుసులు, అతశి అని కూడా అంటారు. అవిసె గింజ ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేయగలదని ఇటీవలి పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, అవిసె అత్యంత శక్తిమంతమైనది. పల్లెటూళ్లలో బరువు, కీళ్ళనొప్పులు, దగ్గు, జలుబు నయం చేయడానికి, పచ్చళ్ళు చేసుకోవడానికి అవిసె గింజలను ఉపయోగిస్తారు. మన పూర్వీకులు ఈ అవిసెగింజలతో ఎన్నో వైద్యాలు చేసేవారు. ఇప్పటికీ బామ్మలు, అమ్మమ్మలు ఈ గింజలతో ఏవో చిట్కా వైద్యాలు చేస్తుంటారు ఎలా తినాలి? ►అవిసె గింజలను నానబెడితే మొలకలు వస్తాయి. ఈ మొలకలు ఉదయాన్నే తింటే అవిసె గింజలల్లో ఉండే పూర్తిస్థాయి పోషకాలు మనకు అందుతాయి గింజలను ఎండబెట్టి పొడిచేసి ఈ పొడిని మనం తీసుకునే ఆహారంలో కూరల్లో పళ్లరసాలు లేదా లస్సిలో పైన చల్లుకుని తాగవచ్చు. ►అపార ఔషధ గుణాలున్న అవిసెగింజల్ని ఆకుకూరలు, కాయగూరలు, చేపలతోపాటు ఆహారంలో చేర్చుకోవచ్చు. ►ఉదయాన్నే తీసుకునే ఆహారంతోపాటు అవిసె గింజలను తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ►అవిసె గింజల నూనెను వేడి చేయకూడదు. అలా చేస్తే నూనెలో ఉండే పోషక విలువలు పూర్తిగా నశిస్తాయి. అయితే అవిసె గింజలను వేయించుకొని తినవచ్చు. ►అవిసె గింజలు తీసుకున్నప్పుడు ఎక్కువ మంచి నీళ్లు తాగడం మంచిది. ►ఇంట్లో తయారు చేసిన జున్ను, యోగర్ట్, ఇంకా ఎన్నో ఇతర ఆహారాలకు ఈ గింజలను చేర్చుకోవచ్చు. ►అవిసె వాడకంతో ఆరోగ్యంలో చోటుచేసుకునే అద్భుత ఫలితాలను, పరిణామాలను మీరే గమనించండి. చదవండి: Garlic For Winters: సైనసైటిస్, జలుబు, ఫ్లూతో బాధపడేవారు ఉదయాన్నే వెల్లుల్లి తింటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఇవి తినండి.. నాజూకుగా..
నాజూకుగా.. సరైన బరువుతో.. ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అయితే, కొందరికి మాత్రం ఇది ఎప్పటికీ నెరవేరని కలలాగే మిగిలిపోతుంది. కానీ.. ఆలోచిస్తే ఆరువేల ఉపాయాలు ఉండనే ఉన్నాయిగా..! పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలతో అధికబరువుకు చెక్‌పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ 7 చక్కని మార్గాల ద్వారా ఏ విధంగా బరువు తగ్గొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం. పొటాషియంతో ఎన్నో ప్రయోజనాలు.. పొటాషియం అనేది ఒక ముఖ్యమైన పోషకాహార ఖనిజం. మన శరీరంలోని కీలకమైన జీవక్రియల్లో దీని పాత్ర ఎనలేనిది. చెడు ద్రావణాల నుంచి రక్షణ కల్పించి, కండరాల నిర్మాణంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జీవక్రియ సమతౌల్యానికి తోడ్పడుతుంది. గుండె, కిడ్నీలు సక్రమంగా, సమర్థవంతంగా పనిచేసేలా చూస్తుంది. ఈ అనేకానేక ప్రయోజనాలతోపాటు బరువు తగ్గడంలో కూడా పొటాషియం కీలకపాత్ర పోషిస్తుందన్నది నిపుణుల మాట. నూట్రియంట్స్ జర్నల్ ప్రచురించిన టెల్ అవివ్ యూనివర్సిటీ పరిశోధనల నివేదిక ప్రకారం శరీరంలో పొటాషియం స్థాయి పెరగడం వల్ల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) గణనీయంగా తగ్గుతుంది. ఆహారం ద్వారా పొటాషియం తీసుకున్న తర్వాత బీఎమ్‌ఐలో అంతకు మునుపు లేని మార్పులు కనిపించాయని అధ్యనాలు వెల్లడించాయి. కాబట్టి తగినంత పొటాషియం ఉన్న ఆహార పదార్ధాలు తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు. అవిసె గింజలు అవిసె గింజల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని నేరుగా తినొచ్చు లేదా ఇతర మిశ్రమాలతో కలిపి ద్రావణంగా తీసుకోవచ్చు. బరువు తగ్గడ్డానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అరటి పండు సాధారణంగా ఏడాది పొడవునా అందరికీ అందుబాటులో ఉండదగ్గ ఫలాల్లో అరటి ఒకటి. అరటి పండులో ఐరన్, పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. దీనిని నేరుగా తినవచ్చు లేదా ఇతర తృణధాన్యాలతో కలిపి తీసుకోవచ్చు. మీ బరువు తగ్గించేందుకు అరటి సహాయపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అవకాడో పండు అవకాడో పండ్లు మెత్తగా, క్రీమీగా మధురమైన రుచిని కలిగి ఉంటాయి. వీటిని గుజ్జులా చేసుకుని అనేక రకాలుగా వినియోగిస్తారు. దీనిని వివిధ రకాలైన ఆహార పదార్ధలతో కలిపి తినోచ్చు. చేప పొటాషియం మాత్రమేకాకుండా బ్రెయిన్ హెల్త్‌కు ఎంతో ఉపకరించే ఒమేగా-3 కోవ్వు ఆమ్లాలు కూడా చేపలో అధికంగా ఉంటాయి. చేపలో క్యాలరీలు కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల బరువుతగ్గేందుకు సహాయపడే ఆహారాల్లో చేపలు ఉత్తమమైనవి. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా..? కొబ్బరి తింటే సరి! శనగలు శాఖాహారులు ప్రత్యామ్నాయంగా వినియోగించదగిన ప్రొటీన్ ఫుడ్.. శనగలు. ఒక రాత్రంతా బాగా నానబెట్టిన శనగల్లో ఇతర ఇన్గ్రీడియన్ట్స్ మిక్స్ చేసి రుచి కరమైన హమ్మస్ క్రీమ్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని బ్రెడ్ లేదా చపాతి తో కలిపి తినవచ్చు. మీ ఆహారంలో శనగలు చేర్చి తినడం ద్వారా సులువుగా బరువు తగ్గొచ్చు. స్వీట్ పొటాటో లేదా చిలగడ దుంప ఆవిరిపై ఉడికించిన చిలగడ దుంపలను కొన్ని రకాల మసాలా దినుసులతో కలిపి తినవచ్చు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్డీఏ) అధ్యయనం ప్రకారం వంద గ్రాముల స్వీట్ పొటాటోలో 337 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. కిడ్నీ బీన్స్ లేదా రాజ్మా రాజ్మాలో ప్రొటీన్లతోపాటు పొటాషియం కూడా అధిక స్థాయిలో ఉంటుంది. దీనిని రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా ప్రతి రోజూ మీ శరీరానికి అవసరమైన 35 శాతం పొటాషియం అందుతుంది. ►ఈ ఆహారపు అలవాట్లతో మీరు కోరుకునే శరీరాకృతిని సొంతం చేసుకునే అవకాశం కలుగుతుంది. చదవండి: National Nutrition Week 2021: రోజూ ఉదయం ఈ డ్రింక్స్ తాగారంటే.. -
అవిసెగింజలతో రక్తపోటుకు చెక్..
అవిసెగింజలతో (ఫ్లాక్స్సీడ్స్) రక్తపోటును అదుపు చేయవచ్చని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. అవిసెగింజలను క్రమం తప్పకుండా ప్రతిరోజూ 30 గ్రాముల చొప్పున తిన్న వారిలో పన్నెండు వారాల వ్యవధిలోనే రక్తపోటు అదుపులోకి వచ్చిందని, ఏడాది వ్యవధిలో గణనీయంగా తగ్గిందని వారు చెబుతున్నారు. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే, అవిసె గింజలు తినేవారిలో రక్తపోటు ఆశ్చర్యకరంగా అదుపులోకి వచ్చిందని డాక్టర్ డెల్ఫిన్ రోడ్రిగ్జ్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే, అవిసెగింజలు తినడం వల్ల రొమ్ముకేన్సర్ ముప్పు కూడా గణనీయంగా తగ్గుతుందని రెండేళ్ల కిందట జరిగిన మరో అధ్యయనంలో తేలింది.