Flax Seeds: కాయగూరలు, చేపలతోపాటు అవిసె గింజలు కలిపి తింటే..

Flax Seeds Amazing Health Benefits How To Consume In Telugu - Sakshi

అద్భుత ఫలాల అవిసె గింజలు

ఎలా తినాలి?

Flax Seeds Amazing Health Benefits How To Consume: అవిసె గింజలను ఆంగ్లంలో ఫ్లేక్స్‌ సీడ్స్‌ అంటారు. తెలుగులో అవిసె గింజలు, ఉలుసులు, అతశి అని కూడా అంటారు. అవిసె గింజ ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేయగలదని ఇటీవలి పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, అవిసె అత్యంత శక్తిమంతమైనది.

పల్లెటూళ్లలో బరువు, కీళ్ళనొప్పులు, దగ్గు, జలుబు నయం చేయడానికి, పచ్చళ్ళు చేసుకోవడానికి అవిసె గింజలను ఉపయోగిస్తారు. మన పూర్వీకులు ఈ అవిసెగింజలతో ఎన్నో వైద్యాలు చేసేవారు. ఇప్పటికీ బామ్మలు, అమ్మమ్మలు ఈ గింజలతో ఏవో చిట్కా వైద్యాలు చేస్తుంటారు

ఎలా తినాలి?
అవిసె గింజలను నానబెడితే మొలకలు వస్తాయి. ఈ మొలకలు ఉదయాన్నే తింటే అవిసె గింజలల్లో ఉండే పూర్తిస్థాయి పోషకాలు మనకు అందుతాయి గింజలను ఎండబెట్టి పొడిచేసి ఈ పొడిని మనం తీసుకునే ఆహారంలో కూరల్లో  పళ్లరసాలు లేదా లస్సిలో పైన చల్లుకుని తాగవచ్చు.
అపార ఔషధ గుణాలున్న అవిసెగింజల్ని ఆకుకూరలు, కాయగూరలు, చేపలతోపాటు ఆహారంలో చేర్చుకోవచ్చు.
ఉదయాన్నే తీసుకునే ఆహారంతోపాటు అవిసె గింజలను తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
అవిసె గింజల నూనెను వేడి చేయకూడదు. అలా చేస్తే నూనెలో ఉండే పోషక విలువలు పూర్తిగా నశిస్తాయి. అయితే అవిసె గింజలను వేయించుకొని తినవచ్చు.
అవిసె గింజలు తీసుకున్నప్పుడు ఎక్కువ మంచి నీళ్లు తాగడం మంచిది.
ఇంట్లో తయారు చేసిన జున్ను, యోగర్ట్, ఇంకా ఎన్నో ఇతర ఆహారాలకు ఈ గింజలను చేర్చుకోవచ్చు.
అవిసె వాడకంతో ఆరోగ్యంలో చోటుచేసుకునే అద్భుత ఫలితాలను, పరిణామాలను మీరే గమనించండి. 

చదవండి: Garlic For Winters: సైనసైటిస్, జలుబు, ఫ్లూతో బాధపడేవారు ఉదయాన్నే వెల్లుల్లి తింటే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top