Bone Pain: ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్‌ తీసుకున్నారంటే!

Bone Pain: Try These 3 Seeds Mixing Powder For Relief Amazing Result - Sakshi

ఎముకల నొప్పులా?

బ్యాక్‌ పెయిన్, లోయర్‌ బ్యాక్‌ పెయిన్, భుజాలు, కీళ్ల నొప్పులు... ఇలా అనేక రకాలుగా ఎముకల బలహీనత వల్ల శరీరంలో నొప్పులు బాధిస్తుంటాయి. కాల్షియం లోపం ఇందుకు ప్రధాన కారణం. ఎముకల నొప్పులు తగ్గాలంటే మంచి ఉపాయం ఒకటుంది.

మూడురకాల గింజల పొడుల మిశ్రమం ఎముకల పటిష్టతకు తోడ్పడి నొప్పులు శాశ్వతంగా దూరం అవుతాయి. ఈ మూడురకాల గింజలు తేలిగ్గా మార్కెట్లో దొరికేవే. ఒకసారి ప్రయత్నించి చూడండి. అవిశె గింజలు, సబ్జాగింజలు, గుమ్మడి గింజలు.. ఈ మూడు రకాల గింజల వినియోగం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది. 

అవిశ గింజలు (ఫ్లాక్స్‌ సీడ్స్‌)
ఫ్లాక్స్‌ సీడ్స్‌ ఒమెగా 3 పోషకాల గని. కాల్షియం, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఒమెగా 3 శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అలాగే వీటిల్లో ఉంటే కాల్షియం ఎముకలను పటిష్టం చేస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్‌ అధిక ఆకలిని తగ్గించి శరీర బరువును అదుపులో ఉంచుతుంది. 

సబ్జా గింజలు (చియా సీడ్స్‌)
సబ్జా గింజలు లేదా చియా సీడ్స్‌లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం ఎముకలు పటిష్టంగా ఉండేలా తోడ్పాటు అందిస్తాయి. ఇందులో కూడా ఒమెగా 3 ఉంటుంది. అలాగే చియా సీడ్స్‌ యాంటీ ఆక్సిడంట్స్‌గా పనిచేస్తాయి. 

గుమ్మడి గింజలు (పంప్కిన్‌ సీడ్స్‌)
ఇందులో ప్రొటీన్, ఫైబర్, ఒమెగా 3, మెగ్నీషియం, జింక్‌ పోషకాలు ఉంటాయి. బాగా శక్తినివ్వడంతో పాటు మీ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గిస్తుంది. 

ఎలా తయారు చేయాలి?
అవిశ గింజలు, చియా సీడ్స్, గుమ్మడి గింజలను సమపాళ్లలో తీసుకుని వేర్వేరుగా వేయించుకోవాలి ఉదాహరణకు ఒకరకం గింజలను 100 గ్రాములు తీసుకుంటే మిగిలిన వాటిని కూడా వంద వంద గ్రాములే తీసుకోవాలి. దోరగా వేగిన తరువాత చల్లార్చి మిక్సీలో వేర్వేరుగా పొడి చేసుకోవాలి.

మిక్సీ వేయడం పూర్తయ్యాక మూడు పొడులను కలిపేసుకుని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. రోజూ ఈ మిశ్రమం నుంచి టీ స్పూన్‌ పొడిని మజ్జిగలో కలుపుకొని తాగాలి లేదా అన్నంలోనైనా కలుపుకొని తినొచ్చు. ఇలా కొద్దిరోజులు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మీ ఎముకల నొప్పులు, నడుము నొప్పి మాయం అవడమే కాకుండా.. మళ్లీ నొప్పులు రావు.  

చదవండి: Amarnath Vasireddy: కూర్చోవడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే! అన్నం ఎక్కువ తిన్నారో!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top