
సినీ రంగంలో అందించే అత్యుత్తమ అవార్డ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ రావడంపై మోహన్ లాల్ స్పందించారు. ఈ అవార్డ్ అందుకోవడం నిజంగా గౌరవంగా ఉందన్నారు. అయితే ఈ విజయం నా ఒక్కడిది కాదు.. నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికీ ఈ ఘనత దక్కుతుందని ట్వీట్ చేశారు. నా కుటుంబం, అభిమానులు, సహచరనటులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రేమ వల్లే ఈ రోజు నాకు అవార్డ్ దక్కిందన్నారు. ఈ గుర్తింపుతో నా హృదయం నిండిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా.. 2023 ఏడాదికి గానూ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు కేంద్రం దాదా సాహెబ్ అవార్డ్ ప్రకటించింది. సెప్టెంబర్ 23న జరిగే జాతీయ సినీ అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని మోహన్ లాల్‌కు అందజేయనున్నారు.
కాగా.. 1980లో సినిమాల్లో అడుగుపెట్టిన మోహన్ లాల్ దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించారు. మంజిల్ విరింజ పూక్కళ్ అనే చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 45 ఏళ్ల తన సినీ కెరీర్‌లో మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ నటించారు. తెలుగులో జనతా గ్యారేజ్ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న మోహన్ లాల్.. కంప్లీట్ యాక్టర్ అనే పేరును సంపాదించుకున్నారు. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటనతో ఆయన నట సామర్థ్యానికి తగిన గౌరవం దక్కిందని సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Truly humbled to receive the Dadasaheb Phalke Award. This honour is not mine alone, it belongs to every person who has walked alongside me on this journey. To my family, audience, colleagues, friends, and well wishers, your love, faith, and encouragement have been my greatest…
— Mohanlal (@Mohanlal) September 20, 2025