
సినీ తారలు ధరించే దుస్తులు మొదలు..వాళ్లు వాడే వస్తువుల వరకు.. ప్రతిదీ చాలా ఖరీదైనవి ఉంటాయి. ట్రెండ్కు తగ్గట్లుగా వాళ్ల వస్తువులు మారుతుంటాయి. ముఖ్యంగా వాహనాలు, మొబైల్ ఫోన్ల విషయంలో స్టార్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్ మోడల్ని తీసుకుంటారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఇప్పటికీ 17 ఏళ్ల క్రితం కొన్న ఫోన్నే వాడుతున్నాడు. అత్యాధునిక టెక్నాలజీ ఉన్న స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కీప్యాడ్ ఫోన్నే ఉపయోగిస్తున్నాడు. ఆ స్టార్ ఎవరో కాదు పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్. ఆయన వాడుతున్న ఫోన్పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఇటీవల మలయాళ దర్శకుడు అభినవ్ సుందర్ సినిమా ఓపెనింగ్ ఈవెంట్లో ఫహద్ పాల్గొన్నాడు. ఆయన ఫోన్ మాట్లాడుతుండగా ఆ విజువల్స్ని అక్కడి ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అందరూ ఆయన వాడుతున్న ఫోన్ గురించే చర్చించడం మొదలు పెట్టాడు. స్మార్ట్ ఫోన్ కాదని ఈ ఫోన్ ఎందుకు వాడుతున్నాడా? అని ఆరా తీస్తున్నారు.
ఇక ఆ ఫోన్ విషయానికొస్తే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో దాని ధర రూ. 5-54 లక్షల వరకు ఉండేదట. ఇది ఒక అల్ట్రా-లగ్జరీ నాన్-స్మార్ట్‌ఫోన్. 2007లో అనౌన్స్ చేసి.. 2008లో ఆ ఫోన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ ఫోన్ టైటానియంతో తయారు చేశారట. నీలమణి స్పటికలతో పాటు చేతితో కుట్టిన లెదర్తో పైభాగం కప్పబడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో మార్కెట్‌లో లేదు కానీ ప్రీ-ఓన్డ్ వెబ్‌సైట్‌లలో రూ.1–1.5 లక్షలకు దొరుకుతుంది. ఈ ఫోన్‌లో స్మార్ట్‌ఫోన్ లాంటి ఆధునిక ఫీచర్లు లేనప్పటికీ దాని బ్రాండ్ విలువ, అరుదైన డిజైన్ కారణంగా ఆ ఫోన్ వార్తల్లో నిలుస్తోంది.
ఫహద్ లాంటి స్టార్ నటుడు ఇంత పాత ఫోన్‌ను ఉపయోగించడం చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ఆయన సింప్లిసిటీకి ఇది నిదర్శనం అంటుంటే..మరికొందరు పాత వస్తువుల పట్ల ప్రేమను చూపిస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.
సినిమాల విషయానికొస్తే.. కుంభసారం’, ‘తొండిముతలం ద్రిక్సాక్షియం’, ‘మాలిక్’ వంటి చిత్రాలతో అతను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీసు అధికారి షేకావత్ పాత్రలో ఫహద్ అద్భుతంగా నటించాడు. ఆయన తాజా చిత్రం మారేసన్ మూవీ జులై 25న విడదల కాబోతుంది.