అర్ధరాత్రి నగ్నంగా అపార్ట్‌మెంట్‌లో హల్‌చల్‌ | Man Hulchul In Malakpet | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి నగ్నంగా అపార్ట్‌మెంట్‌లో హల్‌చల్‌

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

Man Hulchul In Malakpet

హైదరాబాద్: అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి నగ్నంగా అపార్ట్‌మెంట్‌లో చొరబడి హల్‌చల్‌ చేసిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి(45) ఒంటిపై దుస్తులు లేకుండా మూసారంబాగ్‌ వెస్ట్‌ ప్రశాంత్‌నగర్‌ గంగాధర అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డాడు. ఫ్లాట్‌ తలుపు సందుల్లో నుంచి తొంగి చూస్తూ అపార్ట్‌మెంట్‌ అంతా తిరుగుతూ పరుగులు పెట్టాడు.

 దీంతో భయాందోళనకు గురైన అపార్ట్‌మెంట్‌వాసులు బయటికి వచ్చి చూసేసరికి అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం సీసీ కెమెరాలు పరిశీలించిన వారు సదరు వ్యక్తి కారులో వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆపార్ట్‌మెంట్‌ వాసి రోహన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన కీలక ఆధారాలు దొరికాయని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement