హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. నేడు (శనివారం) జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది.
సొంత మైదానంలో గత మ్యాచ్‌లో చెలరేగి రాజస్తాన్‌ను చిత్తు చేసిన రైజర్స్ అదే జోరును కొనసాగించి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది.


