సూర్యకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌? | Sanju Samson likely lead the Indian team on the Ireland tour: Reports | Sakshi
Sakshi News home page

IND vs IRE: సూర్యకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌?

Apr 17 2026 1:43 PM | Updated on Apr 17 2026 3:03 PM

Sanju Samson likely lead the Indian team on the Ireland tour: Reports

ఐపీఎల్‌-2026 సీజన్ తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీబీజీగా గడపనుంది. తొలుత జూన్‌లో స్వ‌దేశంలో మూడు వ‌న్డేలు, ఏకైక టెస్టు సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌తో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. అనంత‌రం మెన్ ఇన్ బ్లూ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనుంది.

అయితే జూలైలో ఇంగ్లండ్‌తో జ‌రిగే ప్ర‌ధాన సిరీస్ దృష్ట్యా ఐరీష్ టూర్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి యువ జట్టును పంపాలని బీసీసీఐ  భావిస్తుందంట. రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. 

ఐపీఎల్‌లో దుమ్ములేపుతున్న  వైభవ్ సూర్యవంశీ ఆయూశ్ మాత్రే, ప్రిన్స్ యాదవ్ వంటి యువ ఆటగాళ్ల పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌, రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కూడా ఐర్లాండ్ టూర్ కోసం సెలెక్టర్లు పిలుపునిచ్చే ఛాన్స్ ఉంది.

కెప్టెన్‌గా సంజూ!
అయితే ఈ టూర్‌కు రెగ్యులర్ సారధి సూర్యకుమార్ యాదవ్ దూరం కావడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు పగ్గాలను సంజూ శాంసన్‌కు అప్పగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంజూ ఇప్పటివరకు జాతీయ జట్టుకు నాయకత్వం వహించికపోయినప్పటికి.. కేరళ జట్టుతో పాటు రాజస్తాన్ రాయల్స్‌ను లీడ్ చేసిన అనుభవం అతడికి ఉంది.

సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఇంగ్లండ్ సిరీస్‌లో జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్‌కు టీ20 వరల్డ్‌కప్ అందించిన సూర్య.. వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం విఫలమవుతున్నాడు. అయినప్పటికి అతడిని కెప్టెన్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ సముఖత చూపుతోంది. ఇంగ్లండ్ టూర్‌లో సూర్య మెరుగైన ప్రదర్శన చేస్తే.. 2028 ఒలింపిక్స్ వ‌ర‌కు భార‌త కెప్టెన్‌గా కొనసాగించే అవ‌కాశ‌ముంది.
చదవండి: నా భర్త గురించి తప్పుడు ప్రచారం: వినోద్‌ కాంబ్లీ భార్య

Advertisement
 
Advertisement
Advertisement