అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌ | Midnight Thieves In Hyderabad | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌

Sep 1 2026 11:34 AM | Updated on Sep 1 2026 12:07 PM

Midnight Thieves In Hyderabad

మేడ్చల్ జిల్లా:  పీర్జాదిగూడ డివిజన్‌ పర్వతాపూర్‌ శబరిగార్డెన్‌ బ్యాక్‌ సైడ్‌ బీపీఎం గ్రీన్‌ల్యాండ్స్‌ కాలనీలో తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ముసుగులు, గ్లౌజులు ధరించి టార్చి లైట్లతో కాలనీలో తిరుగుతున్నారని కాలనీవాసులు తెలిపారు. కాలనీ వాసులు తెలిపిన మేరకు.. ఓ ఇంట్లో సెల్‌ఫోన్‌ అపహరణకాగా.. మరో ఇంట్లో నగదు దొంగతనానికి గురైందన్నారు.

ఈ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.  దొంగలు కాలనీలో పలు వీధుల్లో చాలాసేపు సంచరిస్తూ.. పరిశీలించిన దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ ఏమీ లభించకపోవడంతో మరో ఇంట్లోకి గోడ దూకేందుకు ప్రయత్నించగా.. ఓ మహిళ కేకలు వేయడంతో వారు అక్కడినుంచి పారిపోయారు. ఘటనపై మేడిపల్లి పోలీసులు విచారణ జరిపి రాత్రి వేళల్లో గస్తీని పెంచి తమకు రక్షణను కలి్పంచాలని స్థానికులు కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement