నేపాల్‌లో నగర వాసి మిస్సింగ్‌! | Hyderabad Man Missing During Mansarovar Pilgrimage After Flash Floods In Tibet, Check Details Inside | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో నగర వాసి మిస్సింగ్‌!

Sep 1 2026 9:42 AM | Updated on Sep 1 2026 9:59 AM

Hyderanad Man Dhanpal Reddy Missing Nepal

హైదరాబాద్‌: ఆయన శివుడికి పరమ భక్తుడు. వీపు, భుజం, చేతులపై శివుడి గుర్తులతో పచ్చ బొట్లు వేయించుకున్నారు. అదే ఆధ్యాత్మిక భావనతో మానస సరోవర్‌ యాత్రకు వెళ్లారు. కానీ, ఆకస్మిక వరదలతో ఆచూకీ దొరకడం లేదు. ఇదంతా మణికొండ వాసి రాళ్లగూడెం ధన్‌పాల్‌రెడ్డి గురించి. డివిజన్‌లోని వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన ఈయన  ఆగస్టు 23న హిల్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఆధ్వర్యంలో పుణె నుంచి 66 మందితో కలిసి వెళ్లారు. వీరిలో ఎక్కువమంది పుణె వారు కాగా, కొందరు హైదరాబాదీలూ ఉన్నారు. 

గత నెల 26న ఉదయం 8.30కు టిబెట్‌లోని ఇమిగ్రేషన్‌ కేంద్రంలో ఉన్నామని, అది పూర్తికాగానే ముందుకెళ్తామని సమాచారం ఇచ్చారు. ఆ రోజే ఆకస్మిక వరద సంభవించింది. తర్వాత ధనపాల్‌రెడ్డి ఫోన్‌ స్విచాఫ్‌ వస్తోందని తండ్రి నర్సింహారెడ్డి తెలిపారు. అక్కడి ఎంబసీ వారు కుటుంబసభ్యుల డీఎన్‌ఏ పంపిస్తే మీవారి వివరాలను పరిశీలిస్తామనే సమాధానం ఇచ్చారని అన్నారు. ధనపాల్‌రెడ్డికి భార్య, 8వ తరగతి చదువుతున్న కుమారుడు, 7వ తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. ఆగస్టు 16న అలకాపూర్‌ టౌన్‌షిప్‌లో దుస్తుల దుకాణం ప్రారంభించారు.    

చదవండి: 26 విపత్తుల తేదీ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement