హైదరాబాద్: బెంగళూరు నుంచి వచ్చేసరికి ఇల్లంతా అపరిశుభ్రంగా ఉందన్న మనస్థాపంతో ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన దాట్ల చంద్రావతి (38) తన భర్త, పిల్లలతో కలిసి షేక్‌పేట సమీపంలోని సక్కుబాయి నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం పని నిమిత్తం బెంగళూరు వెళ్లిన చంద్రావతి సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చారు. ఇంట్లోకి రాగానే ఎక్కడ చెత్త అక్కడే ఉండడం, ఇల్లంతా అపరిశుభ్ర వాతావరణంలో దుర్వాసనలు వస్తుండటాన్ని చూసి ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. భర్త, పిల్లలు ఇంట్లోనే ఉండగానే తన గదిలోకి వెళ్లిన ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.


