బెంగుళూరు: యువకుడి వేధింపులతో యువతి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్.లేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అగర చెరువులో శనివారం చోటుచేసుకుంది. శివమొగ్గ జిల్లా సాగర తాలూకా బెళలమక్కికి చెందిన వాణి(22), అభిషేక్‌లు ఒకే కాలేజీలో చదివారు.
ఏడాదిక్రితం యువతి ఉద్యోగం కోసం బెంగళూరుకు చేరుకుని బంగారు దుకాణంలో పనిచేస్తోంది. గతంలో ఉన్న పరిచయం కారణంగా వాణికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. వాణికి చెందిన ప్రైవేటు ఫొటోలు సేకరించి వేధించడం ప్రారంభించాడు. పిలిచినప్పుడు రూమ్‌కు రావాలని మెసేజ్ చేసేవాడు.
రాకపోతే నీ పరువు తీస్తానని బెదిరించేవాడు. దీంతో బాధితురాలు చెరువులోకి దూకి ఆత్మహత్యచేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. వాణి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాదీనం చేసుకున్నారు. ‘అమ్మనాన్న నన్ను క్షమించండి నన్ను గుర్తుకు తెచ్చుకోకండి, ఇంటి పరువు ముఖ్యం, నా చావుకు అభిషేక్ కారణం. నన్ను బ్లాక్‌మెయిల్ చేసి వేధించాడు’ అని పేర్కొంది. హెచ్‌ఎస్‌ఆర్. లేఔట్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి అభిషేక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


