దీపావళి పండుగ ముగిసినా..ఆ టపాసులు, చిచ్చుబుడ్డుల ఆనందోత్సాహం మాత్రం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. అయితే ఈ పండుగను దేశంలో పలు రాష్ట్రాల ప్రజలు జరపుకునే విధానంలో విభిన్న సంస్కృతులు కనబడతాయి. అందులోనూ కన్నడ నాట ఈ పండుగ వ్యవసాయ మూలాలను గుర్తుకుతెచ్చేలా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఈ పండుగ సమయంలోనే దీపావళి బొనాంజాలా కర్ణాటకలోని ఓ గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన కాంతార మూవీ ఏ రైంజ్‌లో సూపర్ డూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఎప్పటికీ మన మూలాలుతో కూడిన సినిమా అయినా పండుగైనా..అదరహో అనేలా అందర్నీ ఆకర్షిస్తుంది, కట్టిపడేస్తుంది. అందుకు ఉదాహరణే కర్ణాటకలోని మలేనాడు గ్రామంలో జరిగే దీపావళి పండుగ. ఇక్కడ ఈ వేడుక ఏవిధంగా జరుగుతుందంటే..
పశ్చిమ కనుమల ప్రాంతమైన కర్ణాటకలో మళెనాడులో దీపావళి పండుగ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా జరుగుతంది. వ్యవసాయ ఆధారిత దేశమైన మన మూలాన్ని గుర్తుకుతెచ్చే సంప్రదాయబద్ధంగా జరపుకుంటారు అక్కడి ప్రజలు. అక్కడ దీపావలిని మూడు రోజుల పండుగలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అక్కడి ప్రజలు.
తొలిరోజు: బూరే హబ్బా, పశువుల పూజ
మళెనాడు దీపావళి ప్రారంభాన్ని బూరే హబ్బా సూచిస్తుంది. అంటే ఇది మన ఆరోగ్యం కోసం చేసే ధన్వంతరి పూజ మాదిరిగా ఉంటుంది. ఇక్కడ ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధాలు, మూలికలను గ్రామస్తులు పవిత్రంగా భావిస్తారు. ఈ దీపావలి రోజు మంచి అమూల్యమైన మూలికలను, ఔషధాలను సేకరించి వాటిని కొత్త కొండలో నింపుతారు.
ఆ తర్వాత వ్యవసాయానిక ఆధారమైన పశువులను పూజిస్తారు. ఇక కుండలో సేకరించిన మూలికలలోకి..ఆ రోజు రాత్రి అప్పుడే తీసుకువచ్చిన నీటితో నింపడమే కాకుండా స్నానపు పెద్దకుండను కూడా నీటితో నిప్పుతారు. ఇది శుద్ధి చేసే ప్రక్రియ అన్నమాట. ఇది ఆరోగ్యం, పరిశుభ్రత విలువలను నేర్పించేలా సాగుతుంది తొలి రోజు పండుగ.
రెండోరోజు లక్ష్మీ పూజ, నూనె స్నానాలు
రెండో రోజు ఇంటిని రంగవల్లులతో అలంకరించి మట్టి దీపాలు, అరటి ఆకులతో అత్యంత శోభాయమానంగా అలంకరిస్తారు. అలాగే నూనెతో స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. ఈ లక్ష్మీ పూజ చేసేరోజు ఆరోగ్య ప్రదంగా ఉండేలా నూనె స్నానాలు చేసి ఇంటిల్లాపాది లక్ష్మీ పూజ చేస్తారు.
ఆఖరి రోజు
చివరి రోజు వివిధ పిండి వంటలు చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, బాణసంచా కాల్చడం వంటివి ఉంటాయి. అయితే గ్రామస్తులు ముఖ్యంగా చేసే వంటకాలేంటంటే హోలిగే(బొబ్బట్లు), చక్కులి(జంతికలు), కడుబు(బియ్య పిండితో చేసి కుడుములు మాదిరి ) వంటకాలను తప్పనిసరిగా చేస్తారు.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే మలెనాడులో ప్రత్యేకంగా తీర్థహాళ్లి ప్రాంతంలో ఈ దీపావళి రోజున దీపాలను వెలిగించడంతో తోపాటు బలి మహారాజును స్వాగతించే తంతు ఉంటుంది. అందుకోసం కాగాడాలను పంట్టుకుని చేలగట్ల వద్దకు వస్తారు. దీపావళి అమవాస్య మరునాడు బలిపాఢ్యమి..ఆ రోజు ఆయన భూమ్మీదకు వచ్చి సందర్శిస్తాడని అక్కడి ప్రజల నమ్మకం.
అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చివరగా పట్టణాల్లో జరిగే ఆధునిక శోభతో జరిగే దీపావళి పండుగలా కాకుండా మలెనాడులో ప్రకృతితో మమేకమై వ్యవసాయంతో ముడిపడిన పండుగగా జరుపుకోవడం విశేషం. ఇక్కడ ఆధ్యాత్మికతతో తోపాటు, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతిని మిళితం చేసేలా ఈ వెలుగుల పండుగును జరుపుకుంటారు.
The deepavali celebrated on Malenadu area especially Thirthahalli, putting Deepada stock , and welcoming Bali maharaj to see his land ,it's a symbolic lighting arrangements to show our native to Bali maharaj , as we belive he visits at the time of Deepavali Bali Padyami.… pic.twitter.com/JQ5WzqCzL1
— Madhukara R Maiya 🇮🇳 (@madhumaiya) October 22, 2025
(చదవండి: 200 ఏళ్లుగా అక్కడ దీపావళి లేదు..! కానీ మహాలయ అమావాస్యే..)


