టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, భార్య ప్రియదర్శినితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుధీర్‌బాబు దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు దర్శకుడు వేణు కూడా కుటుంబంతో కలిసి తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.


