నిజామాబాద్‌: కుటుంబాన్ని బలిగొన్న కరెంట్‌ | Nizamabad: 3 of Family Electrocuted in Agriculture Land | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌: కుటుంబాన్ని బలిగొన్న కరెంట్‌

Feb 20 2025 11:01 AM | Updated on Feb 20 2025 1:00 PM

Nizamabad: 3 of Family Electrocuted in Agriculture Land

నిజామాబాద్, సాక్షి: బోధన్‌ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంట్‌ తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షాటాపూర్‌కి చెందిన గంగారాంకి పెగడపల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది. 

అయితే అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు కరెంట్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో.. భార్య, కొడుకుతో కలిసి పొలానికి వెళ్లాడు. ఈ టైంలో బోర్ మోటార్ కరెంట్ వైర్లు బయటకు వచ్చి.. ఆ కుటుంబ సభ్యులకు తగిలింది. దీంతో ఆ ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement