భారతదేశంలోనే అతిపెద్ద ధాన్య వాణిజ్య వేదిక అయిన ఆర్య.ఏజీ.. దేశవ్యాప్తంగా 25 స్మార్ట్ ఫార్మ్ సెంటర్లు ప్రారంభించింది. ఈ సెంటర్లు రైతుల సమస్యలను పరిష్కరిస్తాయి. దీనికోసం టెక్నాలజీ, డేటా బేస్డ్ వంటి వాటిని ఉపయోగిస్తుంది. లాభదాయక వ్యవసాయ పర్యావరణాన్ని రూపొందించాలనే ఉద్దేశ్యంతో సంస్ట ముందుకు సాగుతోంది.
ప్రతి స్మార్ట్ ఫార్మ్ సెంటర్.. ఒక వ్యవసాయ కేంద్రంగా పనిచేస్తుంది. రైతులు ఎదుర్కునే.. పంటలకు సంబంధించిన సవాళ్లను ఇది పరిష్కరిస్తుంది. ఈ సెంటర్లు భూసార పరీక్షలు (సాయిల్ టెస్ట్), స్థానిక వాతావరణ సమాచారం, డ్రోన్ ఇమేజింగ్ వంటివాటికి సంబంధించిన విషయాలను రైతులకు వెల్లడిస్తూ.. వారికి శిక్షణ ఇస్తాయి.
ఆర్య.ఏజీ స్మార్ట్ ఫార్మ్ సెంటర్లు రైతులు సాగు చేసే ప్రతిదశలోనూ సహాయపడతాయి. ఇవన్నీ విత్తనాలు, నీటిపారుదల నుంచి పంట ప్రణాళిక & ఫైనాన్సింగ్ వరకు.. మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి. ఇవి నియోపెర్క్, భారత్‌రోహన్, ఫార్మ్‌బ్రిడ్జ్, ఫిన్హాట్, ఫైల్లో వంటివాటితో పాటు కంపెనీ కమ్యూనిటీ వాల్యూ చైన్ రిసోర్స్ పర్సన్స్ సహకారంతో అభివృద్ధి చేశారు.


