
జన్యు సవరణకు సంబంధించిన ఆధునిక బ్రీడింగ్ ఆవిష్కరణ నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో ఎటువంటి నియంత్రణ చట్టాలు, నియమనిబంధనలు అమల్లో ఉన్నదీ ఈ ఇన్ఫోగ్రాఫిక్ తెలియజెప్తోంది. ఈ దేశాలు జన్యు సవరణ వంగడాలను సాధారణ కొత్త వంగడాలుగానే పరిగణిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో చట్టాల్లో వచ్చిన మార్పుల వల్ల ఇది సాధ్యమైంది.
సైట్ డైరెక్టెడ్ న్యూక్లియాసెస్1 (ఎస్‌డిఎన్1) పద్ధతిలో రూపొందించిన జన్యు సవరణ వంగడాలను సాధారణ కొత్త వంగడాల మాదిరిగానే పరిగణించాలనే అంశంపై విధాన రూపకల్పన దిశగా చెప్పుకోదగిన స్థాయిలో చర్చలు కొనసాగుతున్న దేశాలు.
పాత చట్టాల ప్రకారం న్యాయస్థానాలు వ్యాఖ్యానాలకు అనుగుణంగా ఎస్‌డిఎన్1 పద్ధతిలో రూపొందించిన జన్యు సవరణ వంగడాలను జన్యు మార్పిడి జీవులు(జిఎంఓల)గానే పరిగణిస్తున్న దేశాలు.
ఉత్తర అమెరికా
జన్యుసవరణ వంటి సరికొత్త బ్రీడింగ్ ఆవిష్కరణలను సాధారణ వంగడాలుగా పరిగణిస్తూ పటిష్ట చట్టాలు చేసిన తొలి వరుస దేశాల్లో అమెరికా, కెనడా ముందు భాగాన ఉన్నాయి. జన్యు సవరణ చేసిన అధిక ఓలిక్ సోయాబీన్స్ నుంచి తీసిన నూనెను ‘కాలినో’ పేరిట విక్రయిస్తున్నారు. ఇది అమెరికాలో 2019 నుంచి వాణిజ్యపరంగా సాగవుతున్న తొలి జన్యు సవరణ పంట.
లాటిన్ అమెరికా
జన్యు సవరణ వంటి న్యూ బ్రీడింగ్ ఇన్నోవేషన్స్‌ను అనుమతిస్తూ 8 లాటిన్ అమెరికా దేశాలు చట్టాలు చేశాయి: బ్రెజిల్, చిలి, కొలంబో, ఈక్వడార్, గ్వాటెమల, హాండురస్, పరాగ్వే, అర్జెంటీనా.
అర్జెంటీనా 2015లోనే తొలి చట్టం చేసింది. కోసిన తర్వాత రంగు మారకుండా ఉండేలా జన్యు సవరణ చేసిన బంగాళదుంపను క్రిస్పర్ ద్వారా 2018లో అర్జెంటీనా రూపొందించింది.
యూరప్
జన్యు సవరణ వంటి న్యూ జినోమిక్ టెక్నిక్స్‌ను జన్యుమార్పిడి వంగడాలుగా కాకుండా సాధారణ కొత్త వంగడాలుగానే భావించాలని యూరోపియన్ యూనియన్ 2023 జూలైలో ప్రతిపాదించింది
యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రెసిషన్ బ్రీడింగ్ బిల్లును 2022 మేలో ప్రవేశపెట్టారు. 2023 మార్చిలో రాజు ఆమోదం పొందింది. ఈ చట్టం సైన్స్ బేస్‌డ్ నియంత్రణ వ్యవస్థను నెలకొల్పటం ద్వారా పరిశోధనలకు దోహదం చేస్తోంది.
చదవండి: జీనోమ్ ఎడిటింగ్.. ప్రయోజనాలు, ప్రతికూలతలు
ఆసియా పసిఫిక్
జన్యు సవరణ వంగడాలు/ఉత్పత్తులను అనుమతిస్తూ ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్, భారత్ చట్టాలు చేశాయి.
జపాన్‌లో జన్యు సవరణ చేసిన ‘హై గబ’ టొమాటోను 2021 నుంచి విక్రయిస్తున్నారు.
బ్రౌన్‌గా మారకుండా ఉండేలా జన్యు సవరణ చేసిన అరటి రకాన్ని నాన్–జిఎంఓ ఉత్పత్తిగా పరిగణిస్తూ ఫిలిప్పీన్స్‌లో 2023లో చట్టం చేసింది.
భారత ప్రభుత్వం జన్యు సవరణను జనుమార్పిడి నియంత్రణ జాబితా నుంచి 2023లో మినహాయించింది. తొలి రెండు జన్యుసవరణ అధిక దిగుబడి వరి వంగడాలను 2025 మేలో విడుదల చేసింది.
ఆఫ్రికా
జన్యు సవరణ వంటి న్యూ బ్రీడింగ్ ఇన్నోవేషన్స్‌ను అనుమతిస్తూ 4 ఆఫ్రికా దేశాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి: నైజీరియా (ఫిబ్రవరి 2022), కెన్యా (మార్చి 2022), మలావి (ఆగస్టు 2022), ఘన (అక్టోబర్ 2023).
ఇన్ఫోగ్రాఫిక్ సౌజన్యం: isaaa.org