ఆసియా క్రీడల నుంచి తప్పించడంపై భారత అథ్లెట్‌ ఆవేదన | wushu athlete threatens suicide after Asian Games snub | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడల నుంచి తప్పించడంపై భారత అథ్లెట్‌ ఆవేదన

Sep 12 2026 4:45 PM | Updated on Sep 12 2026 4:51 PM

wushu athlete threatens suicide after Asian Games snub

18 ఏళ్ల భారత వుషు క్రీడాకారిణి దివ్యాంశి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆసియా క్రీడల జట్టు నుంచి చివరి నిమిషంలో తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో తనకు ఆత్యహత్యే శరణ్యమంటూ ఓ వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

తొలుత 60 కేజీల సాండా విభాగంలో దివ్యాంశి ఆసియా క్రీడలకు ఎంపికైంది. అయితే చివరి నిమిషంలో ఆమెను జట్టు నుంచి తొలగించి, ఆమె స్థానంలో అనుభవజ్ఞురాలైన రోషిబినా దేవిని ఎంపిక చేశారు. రోషిబినా.. ఎంపిక ట్రయల్స్‌లో దివ్యాంశి చేతిలో ఓడిపోయింది.

దివ్యాంశిని తొలగించి రోషిబినాను జట్టులోకి తీసుకోవడంపై ఆమె కోచ్ అశోక్ గౌతమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దివ్యాంశి గత ఏడాది కాలంలో జరిగిన ఐదు ఎంపిక ట్రయల్స్‌లోనూ మొదటి స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. రోషిబినా తన పలుకుబడిని ఉపయోగించి జట్టులో చోటు సంపాదించిందని ఆరోపించారు.

ఈ ఉదంతంలో వుషు ఫెడరేషన్‌ వాదన మరోలా ఉంది. దివ్యాంశిని జట్టు నుంచి తొలగించడానికి కారణం ఆమె ఫిట్‌నెస్ అని ఫెడరేషన్ తెలిపింది. దివ్యాంశి మోకాలి గాయాన్ని దాచిపెట్టిందని, ఏషియన్ గేమ్స్‌కు ముందు సరిగా శిక్షణ కూడా తీసుకోలేదని పేర్కొంది. అందుకే ఆమె స్థానంలో రోషిబినా దేవిని ఎంపిక చేసినట్లు వివరించింది.

 ఇదీ చదవండి: వైభవ్‌ సూర్యవంశీకి భారీ షాక్‌!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement