‘ఫెన్సింగ్‌’ ఆట ఎలా ఆడ‌తారో తెలుసా? | What is fencing game and how to decides who is winner | Sakshi
Sakshi News home page

Fencing: ఈ కత్తియుద్ధం ఏమిటి?

Sep 12 2026 4:29 PM | Updated on Sep 12 2026 4:40 PM

What is fencing game and how to decides who is winner

కిడ్స్ స్పెష‌ల్‌

పిల్లలూ! పాత కాలం సినిమాల్లో రాజులు కత్తులతో యుద్ధాలు చేయడం చూశారు కదా! ఆధునిక కాలంలో ఇది ఒలింపిక్స్‌లో ఒక అద్భుతమైన ఆటగా మారిపోయింది. దీనినే ‘ఫెన్సింగ్‌’ (Fencing) లేదా మన భాషలో ‘కత్తియుద్ధం’ అంటారు. ఇక్కడ మన దేశానికి చెందిన జోయ్స్ అషితా స్టాలిన్‌రాజ్(Joys Ashitha Stalinraj) పంజాబ్‌లోని పాటియాలాలో శిక్షణ తీసుకుంటూ ఇలా కత్తి తిప్పుతోంది. జపాన్‌లో జరగబోయే ’ఏషియన్‌ గేమ్స్‌–2026’లో భారతదేశం తరఫున మెడల్‌ గెలవడమే ఆమె లక్ష్యం.

ఇంతకీ ఆ కత్తిని ఏమంటారు? ఆట ఆడే విధానాన్ని బట్టి కత్తులను మూడు రకాలుగా పిలుస్తారు. అవి... ‘ఫాయిల్‌’ (Foil), ‘ఎపే’ (epee), ‘సేబర్‌’ (Sabre). ఇవి చాలా తేలికగా, వంగుతూ ఉంటాయి. వీటి చివర మొన ఉండదు కాబట్టి అస్సలు గాయాలు అవ్వవు. కత్తి తాకితే సెన్సర్స్‌ను బట్టి నోట్‌ అయ్యి పాయింట్స్‌ వస్తాయి. ఫెన్సింగ్‌లో ‘డాలు’ (Shield) వాడరు. ప్రత్యర్థి కత్తిని మన కత్తితోనే అడ్డుకోవాలి.

ఈ క్రీడలో ప్రపంచంలో అత్యధికంగా మెడల్స్‌ సాధించి టాప్‌లో ఉన్న దేశం ఏదో తెలుసా? ఇటలీ. ఫ్రాన్స్‌ రెండో స్థానంలో ఉంది. మన దేశం నుండి కూడా మహిళలు ఇలాంటి అరుదైన ఆటల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం నిజంగా మనకందరికీ ఎంతో గర్వకారణం!

ఇదీ చ‌ద‌వండి: 'ప‌త‌కం తెస్తా.. నాన్నకు బ‌హుమ‌తిగా ఇస్తా'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement