మజిల్‌ పెయిన్‌కి అనంతాసనం | Body Muscle Pains | Sakshi
Sakshi News home page

మజిల్‌ పెయిన్‌కి అనంతాసనం

Sep 12 2026 8:05 AM | Updated on Sep 12 2026 8:05 AM

Body Muscle Pains

అనంతాసనం శరీర సమతుల్యత, కాళ్ల ఫ్లెక్సిబిలిటీకి సహాయపడే యోగాసనం. 

చేసే విధానం..
ముందుగా యోగా మ్యాట్‌పై అమృతాసనంలో పడుకోవాలి. ∙నెమ్మదిగా ఎడమ వైపుకు తిరిగి, అనంత పద్మస్వామి మాదిరిలా ఎడమ చేతిని మడిచి, అరచేతిపై లేదా మోచేతి సహాయంతో తలను స΄ోర్ట్‌గా తీసుకోవాలి.

రెండు కాళ్లను ఒకదా నిపై ఒకటి సూటిగా ఉంచాలి. 

ఇప్పుడు కుడి కాలును మోకాలు వంచకుండా నెమ్మదిగా పైకి ఎత్తాలి. 

కుడి చేతితో కుడి కాలి పెద్దవేలిని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. 

నెమ్మదిగా కాలును కిందకు తీసుకువచ్చి, తర్వాత మరో వైపుకు తిరిగి ఇదే విధంగా చేయాలి.

ప్రారంభంలో 10–20 సెకన్లు మాత్రమే చేసి  క్రమంగా సమయాన్ని పెంచవచ్చు.

ప్రయోజనాలు.. 
కాళ్ల కండరాలను బలపరచడానికి సహాయపడుతుంది. ∙తొడలు, హిప్స్, మసిల్స్‌కు స్ట్రెంత్‌ ఇస్తుంది. ∙శరీర బ్యాలె¯Œ ్స, ఫ్లెక్సిబిలిటీ, హ్యామ్‌స్ట్రింగ్స్, తొడ కండరాలకు మంచి స్ట్రెచ్‌ లభిస్తుంది. 

జాగ్రత్తలు.. 
నడుము, మెడ లేదా భుజాలకు తీవ్రమైన నొప్పి ఉంటే జాగ్రత్తగా చేయాలి. ∙హిప్‌ గాయాలు ఉన్నవారికి ట్రైనర్‌ సూచన తప్పనిసరి.

గర్భిణులు లేదా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అర్హత కలిగిన యోగా ట్రైనర్‌/వైద్య నిపుణుల సలహాతో చేయడం మంచిది. ముఖ్యంగా: యోగాలో ఆసనం ఎంత కష్టంగా చేస్తున్నామన్నది కాదు.. శరీరానికి నొప్పి లేకుండా, అవగాహనతో చేయడమే ముఖ్యం. 
అనిత పాతర్ల, యోగా ట్రైనర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement