బ్రష్‌ చేసినా నోటి దుర్వాసనా? | Mouth smell home remedy | Sakshi
Sakshi News home page

బ్రష్‌ చేసినా నోటి దుర్వాసనా?

Sep 12 2026 7:59 AM | Updated on Sep 12 2026 7:59 AM

Mouth smell home remedy

నోటి దుర్వాసనకు.. చాలామంది సరిగ్గా బ్రష్‌ చేయకపోవడమే కారణమని అనుకుంటుంటారు. కానీ క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేస్తున్నా సమస్య ఉన్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. 

  • బ్రష్‌ చేసుకోవడంతో పాటు నాలుకను కూడా టంగ్‌ క్లీనర్‌తో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా నాలుకపై పేరుకుపోయిన ఆహార కణాలు, బ్యాక్టీరియా కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది. 

  • టూత్‌బ్రష్‌ చేరుకోలేని ప్రదేశాల్లో ఆహార పదార్థాలు, ప్లాక్‌ పేరుకుపోవచ్చు. అందుకే రోజుకు కనీసం ఒక్కసారైనా ఇంటర్‌డెంటల్‌ బ్రష్‌తో పళ్లను శుభ్రం చేసుకోవాలి. 

  • నోటిలో లాలాజలం సహజంగా నోటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలో నీరు తగ్గడం, కొన్ని మందుల వల్ల నోరు పోడిబారితే దుర్వాసన పెరగవచ్చు.  

  • వెల్లుల్లి, ఉల్లిపాయ, కారంగా ఉండే ఆహారం, కొన్ని పానీయాలు తాత్కాలికంగా నోటి వాసనను మార్చవచ్చు. కానీ తిన్న చాలా సేపటి తర్వాత కూడా దుర్వాసన కొనసాగితే..  జాగ్రత్తలు తీసుకోవాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement