పిల్లలూ! బీచ్‌లకు వెళ్తే అక్కడ ఏం కనిపిస్తాయి? అందమైన ఇసుక తిన్నెలు, రంగురంగుల గవ్వలు, ఈత కొట్టే జనాలు కదా! కానీ గ్రీస్ దేశంలోని ‘అటోకోస్’ అనే ఒక చిన్న దీవికి వెళ్తే అక్కడ మీకు సరికొత్త టూరిస్టులు కనిపిస్తారు. వారే.. నల్లటి అడవి పందులు (Mediterranean Black Pigs). ఈ అటోకోస్ అనే ప్రైవేట్ దీవిలో మనుషులెవరూ నివసించరు.
కానీ, ఇక్కడ బోలెడన్ని నల్లటి పందులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఈ పందులు మనుషులను చూసి అస్సలు భయపడవు, పైగా వాళ్లను ఏమీ అనవు. టూరిస్టులు సముద్రంలో ఈత కొడుతుంటే, ఈ బుజ్జిపందులు కూడా వాళ్లతో పాటు నీళ్లలోకి దిగి హ్యాపీగా ఈత కొట్టేస్తుంటాయి. బీచ్‌లో టూరిస్టుల పక్కనే దర్జాగా నిలబడి ఫొటోలకు ఫోజులు కూడా ఇస్తుంటాయి. దాంతో టూరిస్టులు ఇక్కడకు క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఈ పందులు సెలబ్రిటీలుగా మారి΄ోయాయి.


