
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా పేరుగాంచిన 'ఫిన్లాండ్'.. భారతీయులకు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వర్క్, ఎడ్యుకేషన్ ప్రయోజనాల నుంచి ఫ్యామిలీ స్పాన్సర్‌షిప్ వరకు అన్ని సదుపాయాలను అందించడానికి దేశం సిద్ధంగా ఉంది.
అందమైన దేశమే కాకుండా.. జీవించడానికి కూడా ప్రసిద్ధి చెందిన ఫిన్లాండ్, వరుసగా ఎనిమిది సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ర్యాంక్ సాధించింది. ఈ దేశంలో భారతీయులు శాశ్వతంగా నివాసం ఉండటానికి.. అక్కడి ప్రభుత్వం అర్హతగల అభ్యర్థులకు శాశ్వత నివాస అనుమతి (PR) కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ప్రయోజనాలు & అర్హతలు
ఫిన్లాండ్‌లో శాశ్వత నివాసం ఉండటం వల్ల.. సామాజిక భద్రత, ఆరోగ్య సంరక్షణ, విద్య, పెన్షన్ పథకాల వంటి ప్రయోజనాలు పొందవచ్చు.మీ కుటుంబ సభ్యులను మీతో చేర్చుకోవడానికి మీరే స్పాన్సర్ చేయవచ్చు. కంటిన్యూస్ రెసిడెంట్ పర్మిట్ కోసం ఫిన్లాండ్‌లో కనీసం నాలుగు సంవత్సరాలు నివసించి ఉండాలి. ఈ వ్యవధి 2026 జనవరి నుంచి ఆరు సంవత్సరాలకు పెరుగుతుంది.
●ఫిన్లాండ్‌లో నివసించడానికి కనీస వార్షిక ఆదాయం 40000 యూరోలు (సుమారు రూ.41.3 లక్షలు).
●2 సంవత్సరాల వర్క్ ఎక్స్‌పీరియన్స్‌తో గుర్తింపు పొందిన మాస్టర్స్/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా 3 సంవత్సరాల వర్క్ ●ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నత స్థాయి ఫిన్నిష్/స్వీడిష్ లాంగ్వేజ్ స్కిల్స్.
●దరఖాస్తుదారులు తప్పనిసరిగా క్లీన్ క్రిమినల్ రికార్డ్ కలిగి ఉండాలి.
అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్
●చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ & పాస్‌పోర్ట్ ఫోటోలు
●ఆర్థిక స్థిరత్వానికి కావాల్సిన రుజువు
●మీ పాస్‌పోర్ట్ ఐడీ పేజీ కాపీ
●విద్య, ఉపాధి లేదా భాషా నైపుణ్యాలను నిరూపించే ఏవైనా డాక్యుమెంట్స్
అప్లై చేసుకోవడం ఎలా
●ఎంటర్ ఫిన్‌లాండ్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో ఫిల్ చేసుకోవచ్చు. పేపర్ దరఖాస్తుకు కూడా అనుమతి ఉంది.
దరఖాస్తు ఫీజు చెల్లించాలి
●బయోమెట్రిక్స్ ఇవ్వడానికి ఫిన్నిష్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ లేదా వీఎఫ్ఎస్ గ్లోబల్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. ఇవన్నీ ●పూర్తయిన తరువాత అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకోవచ్చు.
●మీ అప్లికేషన్ ఆమోదం పొందిన తరువాత.. రెసిడెన్సీ కార్డును రాయబార కార్యాలయం లేదా సేవా కేంద్రం నుంచి తీసుకోవచ్చు.
శాశ్వత నివాసం కోసం అప్లికేషన్ ఫీజు
●ఎలక్ట్రానిక్ అప్లికేషన్: 240 యూరోలు (సుమారు రూ. 24,800)
●పేపర్ అప్లికేషన్: 350 యూరోలు (సుమారు రూ. 36,100)
●18 ఏళ్లలోపు దరఖాస్తుదారులు: 180 యూరోలు (సుమారు రూ. 18,600)
ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక