భారతీయుల నుంచి అమెరికా ఎంతో లబ్ధి పొందింది: మస్క్‌ | America has benefitted from talented Indians says Elon Musk | Sakshi
Sakshi News home page

భారతీయుల నుంచి అమెరికా ఎంతో లబ్ధి పొందింది: మస్క్‌

Dec 1 2025 4:46 AM | Updated on Dec 1 2025 1:10 PM

America has benefitted from talented Indians says Elon Musk

వాషింగ్టన్‌: ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా అత్యంత లబ్ధిపొందిందని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యానించారు. జెరోధా సంస్థ సహవ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ నిర్వహించిన ‘డబ్ల్యూటీఎఫ్‌’ పాడ్‌కాస్ట్‌లో మస్క్‌ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘అమెరికా వలస విధానాలను వ్యతిరేకించే కొన్ని శక్తులే హెచ్‌–1బీ వీసా కార్యక్రమం దురి్వనియోగమయిందనే వాదనను తెరమీదకు తీసుకొచ్చాయి. 

వాస్తవానికి ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా ఎంతో లబ్ధిపొందింది’’ అని అన్నారు. భారతీయుల ఉద్యోగాలను స్థానిక అమెరికన్లకు ఇవ్వాలని ట్రంప్‌ స‌ర్కారు కంకణం కట్టుకుందా? అని ప్రశ్నించగా..‘‘అదెలా సాధ్యం? నిజానికి అత్యంత ప్రతిభావంతులకు అమెరికాలో ఎప్పట్నుంచో కొరత ఉంది. నా సొంత ఎక్స్, టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్‌ఏఐ సంస్థల కోసం సైతం ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కోసం వెతుకుతున్నా. హెచ్‌–1బీని నిలిపేయాలనే గుంపులో నేను లేను’’ అని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అన్నారు. 

నా కుమారుని పేరు శేఖర్‌ 
మస్క్‌ తన వ్యక్తిగత జీవిత వివరాలను కొన్నింటిని తొలిసారిగా బహిర్గతంచేశారు. ‘‘నాకూ శివోన్‌ జిలిస్‌కు పుట్టిన కుమారుల్లో ఒకరికి శేఖర్‌ అనే పదం కలిసొచ్చేలా పేరు పెట్టాం. భారతీయమూలాలున్న అమెరికన్‌ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్‌ గ్రహీత సుబ్రమణ్యన్‌ చంద్రశేఖర్‌ (Subrahmanyan Chandrasekhar) పేరులోంచే శేఖర్‌ను తీసుకున్నాం. సహచరిణి శివోన్‌ సగం భారతీయురాలు. ఆమె తల్లి పంజాబీ. జివోన్‌ను చిన్నతనంలో ఉన్నప్పుడే వేరే కుటుంబం దత్తత తీసుకుంది. అలా శివోన్‌ కెనడాలో పెరిగింది’’ అని మస్క్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement