శ్రీలంక వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్(బెల్ 212) వెన్నప్పువ ప్రాంతంలో కూలిపోయింది. విపత్తు సహాయక చర్యల్లో పాల్గొంటున్న హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. అధికారులు కూడా ధ్రువీకరించారు. వెన్నప్పువ–లునువిలా ప్రాంతంలోని గిన్ నదిలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
దిత్వా తుపాను శ్రీలంక అంతటా తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వరదలు సంభవించగా, మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులో అధికారిక నివేదికల ప్రకారం 123 మంది మృతి చెందారు. రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రకృతి విపత్తులకు ప్రభావితమయ్యారు. తుఫాను కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఆదేశానికి భారత్ ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో భారత్ సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.


