నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో మస్క్ | Zerodha Founder Teases Elon Musk Podcast | Sakshi
Sakshi News home page

నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో మస్క్

Nov 29 2025 3:12 PM | Updated on Nov 29 2025 4:43 PM

Zerodha Founder Teases Elon Musk Podcast

జెరోధా కో-ఫౌండర్ 'నిఖిల్ కామత్' నిర్వహించే పాడ్‌కాస్ట్‌లో ఇప్పటివరకు.. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, బయోటెక్ మార్గదర్శకుడు కిరణ్ మజుందార్-షా, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా మొదలైనవారు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు తాజాగా.. తన పాడ్‌కాస్ట్‌లో ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' పాల్గొన్నట్లు, దీనికి సంబంధించిన చిన్న వీడియో షేర్ చేశారు.

నిఖిల్ కామత్ షేర్ చేసిన చిన్న వీడియోలో.. వీరిరువురు (ఎలాన్ మస్క్, నిఖిల్ కామత్) ఉండటం చూడవచ్చు. వీడియో షేర్ చేస్తూ.. దీనికి క్యాప్షన్ ఇవ్వండి.. అని ఆయన అన్నారు. కేవలం 39 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇదీ చదవండి: ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..

నిఖిల్ కామత్ షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. కొందరు దీనిని ఏఐ వీడియో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఏఐ వీడియోనా?, కాదా? అని తెలుసుకోవడానికి పూర్తి ఎపిసోడ్ రిలీజ్ అయితే గానీ ఖచ్చితంగా చెప్పడం కష్టమే!.

Advertisement
 
Advertisement
Advertisement