ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్.. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ డబ్ల్యుటీఎఫ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. తాను ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ & పెర్‌ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌లకు ఇచ్చిన సలహా గురించి పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. ఎందోమంది ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో.. ''ప్రజల ఉద్యోగాలు కోల్పోయేలా చేయవద్దు'' అని ప్రముఖ ఏఐ కార్యనిర్వాహకులైన సామ్ ఆల్ట్‌మాన్, అరవింద్ శ్రీనివాస్‌లకు చెప్పినట్లు ఏఆర్ రెహమాన్ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. వీరిరువురితో చాలా సేపు మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. పేదరికం, తప్పుడు సమాచారం & సృజనాత్మక సాధనాలకు ప్రాప్యత లేకపోవడం తగ్గించడానికి సహాయపడే పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు కూడా స్పష్టం చేశారు.
ఏఐ అభివృద్ధి గురించి ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. AI వ్యవస్థలను నియమాలు లేని తుపాకీతో పోల్చారు. దీనికి నియంత్రణ లేకపోవడం వల్ల హాని కలిగించవచ్చని ఆయన అన్నారు. కృత్రిమ మేధ కూడా మానవులు నిర్దేశించిన సరిహద్దుల్లో పనిచేయాలని పేర్కొన్నారు.
ఓపెన్‌ఏఐ సహకారంతో చాలా కాలంగా అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక ప్రాజెక్ట్ అయిన 'సీక్రెట్ మౌంటైన్'లో తన ప్రమేయం గురించి రెహమాన్ వివరించారు. మానవ సృజనాత్మకత, ఏఐ సామర్థ్యం రెండూ కలిసి అభివృద్ధికి సహాయపడాలని ఆయన అన్నారు. దీనికి ఆల్ట్‌మాన్ సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పారు.
ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు


