తండ్రి కాబోతున్న మీర్జాపూర్ నటుడు..! | Mirzapur Actor Vikrant Massey And Sheetal Thakur Expecting Their First Child After A Year? Deets Inside - Sakshi
Sakshi News home page

Vikrant Massey-Sheetal Thakur: నటితో ప్రేమపెళ్లి.. తండ్రి కాబోతున్న నటుడు..!

Published Tue, Sep 19 2023 9:48 AM | Last Updated on Tue, Sep 19 2023 10:45 AM

Vikrant Massey Sheetal Thakur expecting their first child after a year  - Sakshi

మిర్జాపూర్ వెబ్‌ సిరీస్ నటుడు విక్రాంత్ మాస్సే తండ్రి కాబోతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో శీతల్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకున్న విక్రాంత్ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. ఆ తర్వాత 2019 నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ప్రెగ్నెన్సీ వార్తలపై విక్రాంత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. గ్యాస్‌లైట్, ఫోరెన్సిక్, గిన్ని వెడ్స్ సన్నీ, ముంబైకర్, లవ్ హాస్టల్ లాంటి చిత్రాల్లో నటించారు. ఆయన భార్య సీతల్ ఠాకూర్ పంజాబీ సినిమాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2018లో వచ్చిన బ్రిజ్‌ మోహన్ అమర్‌ రహే అనే చిత్రం ద్వారా హిందీలోనూ ఎంట్రీ ఇచ్చింది. 

(ఇది చదవండి: ‘టాలీవుడ్‌ డ్రగ్స్‌’ కేసులో నటుడు నవదీప్‌ పేరు)

విక్రాంత్ మాస్సే సినిమాలు

విక్రాంత్ ఇటీవలే 'మేడ్ ఇన్ హెవెన్', 'గ్యాస్‌లైట్' 'ముంబైకర్'లో కనిపించాడు. ఈ ఏడాదిలో 'యార్ జిగ్రీ', 'సెక్టర్ 36', '12 ఫెయిల్' , 'ఆయీ హసీన్ దిల్రుబా' చిత్రాలలో కనిపించనున్నారు. మరోవైపు శీతల్ ఠాకూర్ 'బ్రిజ్ మోహన్ అమర్ రహే', 'ఛప్పర్ ఫాద్ కే' వంటి అనేక సినిమాలు, వెబ్ షోలలో పని చేశారు. 2018లో విడుదలైన 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' వెబ్‌ సిరీస్‌లో విక్రాంత్‌తో కలిసి నటించారు.  బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ అనే వెబ్ సిరీస్‌ సెట్స్‌లో ప్రేమలో పడ్డారు. కాగా.. మీర్జాపూర్‌ వెబ్ సిరీస్‌లో బబ్లూ పండిట్‌ అనే పాత్రలో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement