Palak Tiwari Says Salman Khan Do Not Allow To Wear Short Clothes On Sets, Deets Inside - Sakshi
Sakshi News home page

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌తో షూటింగ్‌.. అలాంటి బట్టలే వేసుకోవాలి, నటి షాకింగ్‌ కామెంట్స్‌

Apr 15 2023 9:20 AM | Updated on Apr 15 2023 10:49 AM

Salman Khan Do Not Allow To Wear Short Clothes On Sets Said Palak Tiwari - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం ‘కిసీకా భాయ్​ కిసీకీ జాన్​’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ జోరు పెంచారు మేకర్స్‌. తాజాగా ఈ సినిమాలో నటించిన నటి పాలక్‌ తివారీ సల్మాన్‌ ఖాన్‌పై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''సల్మాన్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయన సెట్‌లో అమ్మాయిలు పద్దతిగా బట్టలు వేసుకోవాలని రూల్‌ పెట్టారు.

డీప్‌ నెక్‌ ఉండే డ్రెస్సులు అస్సలు వేసుకోవద్దు. సల్మాన్‌ ఇలాంటి రూల్‌ పెట్టడానికి కారణం ఏమిటంటే.. ఆయన సంప్రదాయాలకు ఎక్కువగా విలువిస్తారు. తన చుట్టూ ఉండే మహిళలు సేఫ్‌గా ఉండాలని కోరుకుంటాడు.ఇకక సల్మాన్‌ ఖాన్‌ సినిమా షూటింగ్‌ అనగానే నా తల్లి చాలా సంతోషపడింది.ఎందుకంటే ఆమెకు నా డ్రెస్సింగ్‌ విషయంలో కొన్ని కంప్లైంట్స్‌ ఉండేవి.

కానీ సల్మాన్‌ రూల్స్‌ నేపథ్యంలో నేను నిండుగా కప్పుకొని షూటింగ్‌కి వెళ్తుంటే చూసి అమ్మ మురిసిపోయేది'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక కిసీకా భాయ్​ కిసీకీ జాన్​ సినిమాలో సల్మాన్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement