ఇదెక్కడి ఆచారం రా నాయనా?.. హీరోకు ఏకంగా గిన్నె ఇచ్చారట! | Randeep Hooda on his wedding ceremony with Lin Laishram | Sakshi
Sakshi News home page

Randeep Hooda: హీరోకు వింత అనుభవం.. పెళ్లిలో పోసుకోవడానికి గిన్నె ఇచ్చారట!

Jun 21 2025 5:46 PM | Updated on Jun 21 2025 7:03 PM

Randeep Hooda on his wedding ceremony with Lin Laishram

బాలీవుడ్ నటుడు రణ్‌దీప్‌ హుడా ఇటీవలే జాట్‌ మూవీలో కనిపించారు. సన్నీ డియోల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. అయితే బాలీవుడ్‌లో పలు సినిమాల్లో మెప్పించిన రణ్‌దీప్ హుడా రెండేళ్ల క్రితం తన ప్రియురాలు  లిన్‌ లైస్రామ్‌ను పెళ్లాడారు. 2023లో మణిపూర్‌కు చెందిన లిన్‌ లైస్రామ్‌ను సంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు.

తాజాగా ఆ పెళ్లి వేడుకలో తనకెదురైన విచిత్రమైన అనుభవాన్ని పంచుకున్నారు. మణిపూరి సంప్రదాయంలో జరిగిన ఈ వేడుకలో తనకు మూత్ర విసర్జన కోసం గిన్నె ఇచ్చారని రణదీప్ హుడా గుర్తు చేసుకున్నారు. ఒకరకంగా ఈ పెళ్లి తంతు తనకు అంతర్యుద్ధం లాంటి పరిస్థితిని తలపించేలా చేసిందని తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆ సంఘటనను రణ్‌దీప్‌ హుడా వివరిస్తూ..' పెళ్లిలో నాతో పాటు ఒక సహాయకుడు ఉన్నాడు. ఒక ట్యూటర్ లాగా. నేను నా వస్తువులను తలపై పెట్టుకున్న తర్వాత ఇక తలను వంచడం సాధ్యం కాదు. అప్పుడే నాకు ఒక గిన్నె, గొడుగు ఇచ్చారు. అప్పుడు మనల్ని ఓ ప్రదేశంలో ఉంచుతారు. అక్కడికి అందరూ వచ్చి మనల్ని చూడాలి. ఆ సమయంలో మనం చాలా గౌరవంగా కనిపించాలి. అయితే నేను గిన్నె దేనికోసం అని వారిని అడిగాను. మీరు మూత్ర విసర్జన చేయవలసి వస్తే.. మీకిచ్చిన ఆ గొడుగు తెరిచి అక్కనే మూత్ర విసర్జన చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు దేవుడు కాబట్టి అక్కడి నుంచి కదల్లేరన్నాడు.  వాళ్ల సంస్కృతి చాలా కఠినమైనది. అలాగే చాలా సిస్టమాటిక్‌ కూడా " అని తనకెదురైన  విచిత్ర అనుభవాన్ని వివరించారు.

తన పెళ్లి గురించి మాట్లాడుతూ. 'నా పెళ్లి సమయంలో మణిపూర్‌లో ఒక పెద్ద సమస్య తలెత్తింది. కానీ మేమిద్దరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా ఒక అమ్మాయి ఇంట్లో వివాహం చేసుకోకపోతే అది కూడా వివాహమేనా అని అక్కడే వివాహం చేసుకుంటానని తాను దృఢంగా చెప్పాను. ఈ పెళ్లి విషయంలో తనకు అస్సాం రైఫిల్స్‌లో బ్రిగేడియర్‌గా ఉన్న తన స్నేహితుడు సాయం చేశాడు. మీరు రండి పెళ్లి నేను జరిపిస్తాను అన్నాడు. దీంతో మేము దాదాపు 10 నుంచి 12 మంది అక్కడికి చేరుకున్నాం.' అని తెలిపారు. అయితే మేము లిన్‌ లైస్రామ్  ఇంటికి చేరుకున్నప్పుడు మంచి శాఖాహారం తిన్నారని.. వివాహం చేసుకునే ముందు వారి దేవుళ్లందరినీ పూజించారని  గుర్తు చేసుకున్నాడు. అలాగే నా స్నేహితులు కూడా వివాహానికి తీసుకొచ్చావా? పవిత్ర తీర్థయాత్రకు తీసుకువచ్చావా? అంటూ తనతో జోక్ చేశారని రణ్‌దీప్ హుడా వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement