తల్లికి రెండో పెళ్లి చేసిన నటుడు.. నెటిజన్ల ప్రశంసలు! | Marathi Actor Siddharth Chandekar Gets Mother Married For 2nd Time - Sakshi
Sakshi News home page

Siddharth: నీ జీవితం ఇంకా మిగిలే ఉంది.. తల్లి రెండో పెళ్లిపై నటుడు ఎమోషనల్!

Published Wed, Aug 23 2023 2:58 PM

Marathi Actor Siddharth Chandekar Gets Mother Married For 2nd Time - Sakshi

మరాఠీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ చందేకర్. 'జెండా', 'క్లాస్‌మేట్స్', 'బాలగంధర్వ' లాంటి చిత్రాల్లో నటించారు.  మధుర దేశ్‌పాండే, స్వప్నిల్ జోషి, అమృతా ఖాన్విల్కర్‌తో కలిసి 'జీవ్లగా' షోలో కూడా కనిపించారు. ఇటీవలే నాగేష్ కుకునూర్ దర్శకత్వంలోని 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. తాజాగా సిద్ధార్థ్ చేసిన పనికి నెటిజన్స్ మనసులను గెలుచుకున్నారు. ఇటీవల తన తల్లిని రెండవ వివాహం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తల్లి కోసం ఉద్వేగభరితమైన నోట్ రాసుకొచ్చారు. అంతేకాకుండా తల్లి సీమా చందేకర్ రెండో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.

(ఇది చదవండి: నరేశ్‌-పవిత్ర ప్రేమాయణం.. ఫస్ట్‌ నుంచీ ఇదే జరుగుతుంది!)

సిద్ధార్థ్ నోట్‌లో రాస్తూ.. ' అమ్మా.. హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్. నీ బిడ్డలతో పాటు నీ జీవితం ఇంకా ఉంది. నీకు స్వతంత్రమైన అందమైన ప్రపంచం ఉంది. ఇప్పటివరకు మా కోసం చాలా త్యాగం చేశారు.  ఇప్పుడు మీ గురించి, మీ కొత్త భాగస్వామి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ విషయంలో మీ పిల్లలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. మీరు నా పెళ్లిని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు నేను అదే చేశా. నా జీవితంలో అత్యంత ఎక్కుగా ఆనందపడే పెళ్లి.  ఐ లవ్ యూ అమ్మ.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.' అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు చాలా మందికి ఆదర్శంగా నిలిచారంటూ అభినందిస్తున్నారు. 

(ఇది చదవండి: జైలర్‌ కంట కన్నీరు.. ఆ డైలాగ్‌ రజనీ నిజ జీవితానిదే: డైరెక్టర్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement